క్వార్టర్స్‌కు సాత్విక్ జోడీ
ABN, Publish Date - May 30 , 2025 | 04:36 AM
భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి.. సింగపూర్ ఓపెన్ క్వార్టర్స్‌కు చేరుకోగా.. సింధు, ప్రణయ్ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో..
సింధు, ప్రణయ్ ఇంటికి
సింగపూర్ ఓపెన్
సింగపూర్: భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి.. సింగపూర్ ఓపెన్ క్వార్టర్స్‌కు చేరుకోగా.. సింధు, ప్రణయ్ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జంట 19-21, 21-16, 21-19తో ఇండోనేసియాకు చెందిన సబర్-రెజా పహ్లెవి ద్వ యంపై చెమటోడ్చి నెగ్గింది. డబుల్ ఒలింపిక్ పతక విజేత సింధు 9-21, 21-18, 16-21తో చెన్ యూఫీ (చైనా) చేతిలో, పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 16-21, 14-21తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్‌లో ఎనిమిదో సీడ్ ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ 8-21, 10-21తో చైనాకు చెందిన జియా యి ఫాన్-జాంగ్ షు గ్జియాన్ చేతిలో, మిక్స్‌డ్‌లో రుత్విక శివాని-రోహన్ కపూర్ జంట 10-21, 16-21తో హాంకాంగ్‌కు చెందిన టాంగ్ చున్ మన్-సి యింగ్ సూట్ చేతిలో చిత్తయ్యారు.
ఇవి కూడా చదవండి..
IPL 2025 PBKS vs RCB: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 30 , 2025 | 04:36 AM