ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Saina Nehwal Divorce: ఏడేళ్ల తర్వాత కీలక నిర్ణయం.. భర్తతో సైనా విడాకులు

ABN, Publish Date - Jul 14 , 2025 | 07:57 AM

Saina Nehwal Divorce: కశ్యప్, సైనా నెహ్వాల్ దాదాపు 20 ఏళ్లకు పైగా ప్రేమించుకున్నారు. ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రకారం.. 1997లో ఓ క్యాంప్‌లో వీరికి పరిచయం అయింది. 2002లో ఇద్దరూ ఒకే చోట బాడ్మింటన్ ట్రైనింగ్ తీసుకోవటం మొదలెట్టారు.

Saina Nehwal Divorce

ప్రముఖ బాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడేళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికారు. భర్త పారుపల్లి కశ్యప్‌తో విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ..‘కొన్నిసార్లు జీవితం మనల్ని వేరు వేరు దార్లలోకి తీసుకెళుతూ ఉంటుంది. ఎన్నో ఆలోచనల తర్వాత నేను, పారుపల్లి కశ్యప్ విడిపోవాలని నిశ్చయించుకున్నాము.

మా కోసం మేము శాంతిని, ఎదుగుదలను, సాంత్వనను కోరుకుంటున్నాము. ఈ కష్ట సమయంలో మమ్మల్ని అర్థం చేసుకుని, మా ప్రైవసీని గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని అన్నారు. విడాకులపై కశ్యప్ స్పందించలేదు. కాగా, కశ్యప్, సైనా నెహ్వాల్ దాదాపు 20 ఏళ్లకు పైగా ప్రేమించుకున్నారు. ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రకారం.. 1997లో ఓ క్యాంప్‌లో వీరికి పరిచయం అయింది. 2002లో ఇద్దరూ ఒకే చోట బాడ్మింటన్ ట్రైనింగ్ తీసుకోవటం మొదలెట్టారు. 2004 నుంచి ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు.

ఈ ఇద్దరూ ప్రముఖ బాట్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. 2018, డిసెంబర్ 14వ తేదీన ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. దాదాపు పాతికేళ్ల ప్రేమ.. ఏడేళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ ఇప్పుడు ఇద్దరూ విడిపోతున్నారు. అయితే, విడాకులకు గల కారణాలు తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

విమాన ప్రమాదం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే..

కాలేజ్‌ యూనివర్సిటీ విద్యార్థులకు సెంట్రల్‌ స్కాలర్‌షిప్స్‌

Updated Date - Jul 14 , 2025 | 08:07 AM