Share News

Central Sector Scholarship: కాలేజ్‌ యూనివర్సిటీ విద్యార్థులకు సెంట్రల్‌ స్కాలర్‌షిప్స్‌

ABN , Publish Date - Jul 14 , 2025 | 05:56 AM

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి ఉచ్చతర్‌ శిక్షా ప్రోత్సాహన్‌ యోజన(పీఎం యూఎ్‌సపీ యోజన) కింద సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ స్కీమ్‌ను...

Central Sector Scholarship: కాలేజ్‌ యూనివర్సిటీ విద్యార్థులకు సెంట్రల్‌ స్కాలర్‌షిప్స్‌

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి ఉచ్చతర్‌ శిక్షా ప్రోత్సాహన్‌ యోజన(పీఎం యూఎ్‌సపీ యోజన) కింద సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ స్కీమ్‌ను ప్రకటించింది. ఆర్థికంగా వెనకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఉద్దేశించిన స్కీమ్‌ ఇది. దీని కింద పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు మూడు సంవత్సరాలపాటు రూ. 12000/- చొప్పున, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు రూ.20000/- చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తారు. ప్రతీ సంవత్సరం 82000 కొత్త ఉపకార వేతనాలను అందిస్తారు. మొత్తం స్కాలర్‌షి్‌పలో 50 శాతం మహిళలకు కేటాయించారు.

అర్హత: ఇంటర్‌లో 80 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. కోర్సులు రెగ్యులర్‌ విధానంలో చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షలకు మించ కూడదు.

వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 31

దరఖాస్తు: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో చేయాలి.

అసరమైన ధ్రువపత్రాలు: ఇంటర్‌ మార్కుల మెమో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు, కాలేజీ/యూనివర్సిటీలో అడ్మిషన్‌ రుజువు, సంస్థ కోడ్‌

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/

ఇవి కూడా చదవండి

నెలకు జస్ట్ రూ.4000 పెట్టుబడి.. వచ్చేది మాత్రం రూ.కోటి

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 05:58 AM