ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక అడుగు దూరమే

ABN, Publish Date - May 30 , 2025 | 04:52 AM

‘ఈ సాల కప్‌ నమ్దే’ అంటూ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ కల నెరవేర్చుకునేందుకు మరో అడుగు దూరంలోనే నిలిచింది. గురువారం టేబుల్‌ టాపర్‌ పంజాబ్‌ కింగ్స్‌తో...

ఫైనల్లో బెంగళూరు

  • 8 వికెట్ల తేడాతో ఘనవిజయం

  • 101 రన్స్‌కే పంజాబ్‌ ఆలౌట్‌

  • చెలరేగిన బౌలర్లు

  • సాల్ట్‌ అజేయ అర్ధసెంచరీ

లీగ్‌ దశలో అత్యద్భుత ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు.. ఆ రెండింటి మధ్య క్వాలిఫయర్‌1 మ్యాచ్‌ అంటే అభిమానులు ఏ స్థాయిలో ఊహించుకుంటారు? ఈ హోరాహోరీ పోరులో గెలిచి ఫైనల్‌కు వెళ్లే జట్టేదో తెలుసుకునేందుకు అత్యంత ఆసక్తిగానే ఎదురుచూశారు. కానీ ఉత్కంఠభరితంగా సాగాల్సిన ఆట పూర్తి ఏకపక్షమైంది. బెంగళూరు బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన పంజాబ్‌ కనీసం వంద పరుగులు చేసేందుకే ఆపసోపాలు పడింది. ఇక 101 పరుగుల లక్ష్యాన్ని పది ఓవర్లలోనే ముగించిన ఆర్‌సీబీ తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్‌కు చేరింది.


ముల్లన్‌పూర్‌: ‘ఈ సాల కప్‌ నమ్దే’ అంటూ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ కల నెరవేర్చుకునేందుకు మరో అడుగు దూరంలోనే నిలిచింది. గురువారం టేబుల్‌ టాపర్‌ పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌1లో 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ ఘనవిజయం సాధించింది. దీంతో తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లో అడుగు పెట్టింది. 2009, 2011, 2016 సీజన్లలోనూ తుది పోరుకు చేరినా రన్నర్‌పతోనే సరిపెట్టుకుంది. అటు ఓడిన పంజాబ్‌కు జూన్‌1న జరిగే రెండో క్వాలిఫయర్‌లో ఆడే అవకాశముంది. గుజరాత్‌-ముంబై మ్యాచ్‌ విజేతతో ఈ పోరు ఉంటుంది. పటిష్ఠ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన పంజాబ్‌ను ఆర్‌సీబీ బౌలర్లు చెడుగుడు ఆడేయడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. స్టొయినిస్‌ (26), ప్రభ్‌సిమ్రన్‌ (18), ఒమర్జాయ్‌ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. సుయాష్‌, హాజెల్‌వుడ్‌లకు మూడేసి.. యష్‌ దయాల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరు 10 ఓవర్లలో 2 వికెట్లకు 106 పరుగులు చేసి నెగ్గింది. సాల్ట్‌ (27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 నాటౌట్‌) అర్ధసెంచరీ సాధించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సుయాష్‌ శర్మ నిలిచాడు.

10 ఓవర్లలోనే..: ఇదే వేదికలో కోల్‌కతాపై 111 పరుగుల స్కోరును పంజాబ్‌ కాపాడుకోగలిగింది. ఈసారి కూడా అలాంటి ఫలితాన్ని రిపీట్‌ చేస్తుందేమో అని ఆ జట్టు ఫ్యాన్స్‌ ఆశలు పెట్టుకున్నారు. కానీ మైదానంలో అంత సీన్‌ కనిపించలేదు. కేవలం 102 పరుగుల ఛేదనే అయినప్పటికీ ఓపెనర్‌ సాల్ట్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. విరాట్‌ (12) వికెట్‌తో పేసర్‌ జేమిసన్‌ నాలుగో ఓవర్‌ను మెయిడిన్‌గా వేశాడు. కానీ సాల్ట్‌ మాత్రం ఆరంభం నుంచే బ్యాట్‌కు పనిజెప్పాడు. అర్ష్‌దీప్‌ ఓవర్‌లో 4,6తో పాటు జేమిసన్‌ ఓవర్‌లో 4,4,4,6తో 21 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లేలోనే 61/1 స్కోరుతో సగం కంటే ఎక్కువే లక్ష్యాన్ని పూర్తి చేసింది. అటు మయాంక్‌ (19) ముషీర్‌ ఓవర్‌లో 6,4 సాధించి అవుటయ్యాడు. 23 బంతుల్లో సాల్ట్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాక..పదో ఓవర్‌లో కెప్టెన్‌ పటీదార్‌ (15 నాటౌట్‌) 4,6తో 14 రన్స్‌ రాబట్టి మ్యాచ్‌ను ముగించాడు.


తిప్పేసిన సుయాష్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను ఆర్‌సీబీ బౌలర్లు బెంబేలెత్తించారు. భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన చందాన బ్యాటర్లంతా వేగంగా ఆడేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నారు. నిర్లక్ష్యపు షాట్లతో చేజేతులా వికెట్లను సమర్పించుకున్నారు. అటు పేసర్లు హాజెల్‌వుడ్‌, భువీ, యష్‌లతో పాటు స్పిన్నర్‌ సుయాష్‌ బ్యాటర్లను ఏమాత్రం కుదురుకోనీయలేదు. ఏకంగా ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమై పెవిలియన్‌కు చేరారు. స్టొయినిస్‌ ఆత్మవిశ్వాసంతోనే కనిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. రెండో ఓవర్‌లో ఓపెనర్‌ ప్రియాన్ష్‌ (7)ను యష్‌ అవుట్‌ చేశాక వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. పవర్‌ప్లే ముగిసేలోపే ప్రభ్‌సిమ్రన్‌, కెప్టెన్‌ శ్రేయాస్‌ (2), ఇన్‌గ్లి్‌స (4) పెవిలియన్‌లో కూర్చున్నారు. అప్పటికి స్కోరు 38/4 మాత్రమే. ఆ తర్వాతైనా జాగ్రత్తగా ఆడతారనుకుంటే మధ్య ఓవర్లలో సుయాష్‌ సుడులు తిరిగే బంతులకు బలయ్యారు. తొమ్మిదో ఓవర్‌లో తను శశాంక్‌ (3), అరంగేట్ర బ్యాటర్‌ ముషీర్‌ (0)లను అవుట్‌ చేశాడు. ఇక రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఎదురుదాడికి దిగిన స్టొయిని్‌సను తన తర్వాతి ఓవర్‌లోనే సుయాష్‌ దెబ్బతీయడంతో పంజాబ్‌ కనీసం వంద పరుగులైనా చేస్తుందా? అనిపించింది. అయితే ఒమర్జాయ్‌ పుణ్యమా అంటూ అతికష్టమ్మీద స్కోరు మూడంకెలకు చేరింది. 15వ ఓవర్‌ తొలి బంతికే ఒమర్జాయ్‌ను హాజెల్‌వుడ్‌ అవుట్‌ చేయడంతో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ మరో 35 బంతులుండగానే ముగిసింది.


స్కోరుబోర్డు

పంజాబ్‌: ప్రియాన్ష్‌ (సి) క్రునాల్‌ (బి) యష్‌ దయాల్‌ 7; ప్రభ్‌సిమ్రన్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 18; ఇన్‌గ్లి్‌స (సి) భువనేశ్వర్‌ (బి) హాజెల్‌వుడ్‌ 4; శ్రేయాస్‌ (సి) జితేశ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 2; నేహల్‌ (బి) యష్‌ దయాల్‌ 8; స్టొయినిస్‌ (బి) సుయాష్‌ 26; శశాంక్‌ (బి) సుయాష్‌ 3; ముషీర్‌ (ఎల్బీ) సుయాష్‌ 0; ఒమర్జాయ్‌ (సి) జితేశ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 18; హర్‌ప్రీత్‌ (బి) షెఫర్డ్‌ 4; జేమిసన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 14.1 ఓవర్లలో 101 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-9, 2-27, 3-30, 4-38, 5-50, 6-60, 7-60, 8-78, 9-97, 10-101; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-17-1; యష్‌ దయాల్‌ 4-0-26-2; హాజెల్‌వుడ్‌ 3.1-0-21-3; సుయాష్‌ 3-0-17-3; క్రునాల్‌ 1-0-10-0; షెఫర్డ్‌ 1-0-5-1.

బెంగళూరు: సాల్ట్‌ (నాటౌట్‌) 56; విరాట్‌ (సి) ఇన్‌గ్లి్‌స (బి) జేమిసన్‌ 12; మయాంక్‌ (సి) శ్రేయాస్‌ (బి) ముషీర్‌ 19; పటీదార్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 10 ఓవర్లలో 106/2. వికెట్ల పతనం: 1-30, 2-84. బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 2-0-20-0; జేమిసన్‌ 3-1-27-1; ఒమర్జాయ్‌ 1-0-10-0; హర్‌ప్రీత్‌ 2-0-18-0; ముషీర్‌ 2-0-27-1.

1

ఐపీఎల్‌ ప్లేఆ్‌ఫ్సలో ఎక్కువ బంతులు (60) మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించిన జట్టుగా ఆర్‌సీబీ


ఇవి కూడా చదవండి..

IPL 2025 PBKS vs RCB: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్

Virat Kohli: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన భజ్జీ కూతురు.. కోహ్లీ రిప్లై ఏంటంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 04:52 AM