ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ravindra Jadega Big Six: ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌లో అద్భుతం.. సిక్స్ అంటే ఇదీ..

ABN, Publish Date - May 04 , 2025 | 10:56 AM

రవీంద్ర జడేజా నిన్నటి ,మ్యాచ్‌లో బాదిన సిక్స్ ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది.

Ravindra Jadeja six

ఇంటర్నెట్ డెస్క్: నాలుగో స్థానంలో బ్యాటింగ్ మొదలెట్టిన తరువాత రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో దూకుడు పెరిగిందని చెప్పక తప్పదు. పామ్‌లోకి వచ్చిన అతడు చక్కటి షాట్స్ ఆడుతూ స్టేడియంలో జనాలను కేరింతలు కొట్టిస్తాడు. అయితే, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అతడు కొట్టిన సిక్స్ ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇప్పటివరకూ అంతటి భారీ సిక్స్ చూడని అభిమానులు సంబరంతో స్టేడియంను హోరెత్తించారు

17 ఓవర్‌లో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. ఈ ఓవర్ లుంగి ఎంగిడి వేసి ఫుల్ టాస్ బంతికి జడేజా భారీ సిక్స్‌గా మలిచాడు. డీప్ స్క్వే లెగ్ వైపు భారీ షాట్ ఆడాడు. దీంతో, బంతి ఏకంగా 109 మీటర్లకు చేరుకుంది. దీంతో, ఈ సీజన్‌లో భారీ సిక్సర్లు బాదిన బ్యాటర్లలో తొలి స్థానంలో నిలిచాడు. హైన్‌రిచ్ క్లాసెన్‌ను ఓవర్ టేక్ చేశాడు. క్లాసెన్ 107 మీటర్ల భారీ సిక్స్ చేయగా ఆ తరువాతి స్థానాల్లో ఆడ్రే రస్సల్ (106మీటర్లు), అభిషేక్ శర్మ(106 మీటర్లు), ఫిల్ సాల్ట్ (105మీటర్లు) ఉన్నారు.


ఇక నిన్నటి ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చెన్నై ఆట తీరు అభిమానులను ఆకట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆ తరువాత ఛేదనలో సీఎస్‌కే చెన్నై 211 పరుగులు చేసి ఓడింది. చివరి ఓవర్‌లో పేసర్ యశ్ దయాళ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ స్వల్ప తేడాతో గట్టె్క్క గలిగింది. మొత్తం 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది.


ఇక ఆర్సీబీ బ్యాటింగ్‌లో 18వ ఓవర్‌లో క్రీజలోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ పరుగుల వరద పారించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఖలీల్ వేసిన 19వ ఓవర్‌లో అతడు 6,6,4,6,6నోబ్, 4తో ఏకంగా 33 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో మరో 21 పరుగులు రావడంతో ఆర్సీబీ స్కోరు 200 దాటింది. ఈ నేపథ్యంలో షెఫర్డ్ 14 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేశాడు. ఇక రెండు ఇన్నింగ్స్‌లోనూ చివరి ఓవర్లు ఉత్కంఠ భరితంగా సాగడంతో అభిమానులు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

ఆరెంజ్ క్యాప్‌ తిరిగి లాగేసుకున్న విరాట్ కోహ్లీ..ఇలాగే ఉంటుందా..

డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన రబాడ!

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - May 04 , 2025 | 10:56 AM