Share News

డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన రబాడ!

ABN , Publish Date - May 04 , 2025 | 02:49 AM

డ్రగ్స్‌ వాడినట్టు తేలడంతో దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ సుమారు నెలరోజులపాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గుజరాత్‌ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడిన రబాడ.. గత నెల మూడున హఠాత్తుగా స్వదేశం...

డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన రబాడ!

అందుకే ఐపీఎల్‌కు దూరం

న్యూఢిల్లీ: డ్రగ్స్‌ వాడినట్టు తేలడంతో దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ సుమారు నెలరోజులపాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గుజరాత్‌ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడిన రబాడ.. గత నెల మూడున హఠాత్తుగా స్వదేశం వెళ్లిపోయాడు. అయితే, వ్యక్తిగత కారణాలతో రబాడ లీగ్‌ను వీడినట్టు గుజరాత్‌ ఫ్రాంచైజీ తెలిపింది. కానీ, రిక్రియేషనల్‌ డ్రగ్స్‌ (మాదక ద్రవ్యాలు లాంటివి) వాడినట్టు పరీక్షల్లో తేలడంతో అతడిపై తాత్కాలికంగా వేటుపడింది. ఈ విషయాన్ని రబాడ స్వయంగా ఓ ప్రకటనలో తెలిపాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ సమయంలో అతడు డోపింగ్‌ నిబంధనలను అతిక్రమించినట్టు సమాచారం. సామర్థ్యాన్ని పెంచే డ్రగ్‌ కాకపోవడంతో.. గతంలో కొన్ని కేసుల్లో విధించిన శిక్షల ప్రకారం అతడిపై విధించిన సస్పెన్షన్‌ ముగిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రబాడ ఐపీఎల్‌కు తిరిగి వచ్చాడు. మంగళవారం ముంబైతో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 02:49 AM