Multan Sultans Donation: సిక్స్ కొడితే రూ.లక్ష
ABN, Publish Date - Apr 14 , 2025 | 03:48 AM
పీఎస్‌ఎల్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ పాలస్తీనా కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రతీ సిక్సర్ మరియు వికెట్‌కి రూ.లక్ష విరాళంగా ఇవ్వనున్నారు
పీఎస్ఎల్ టీమ్ విరాళం
కరాచీ: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ )కు చెందిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించింది. ఇందులో భాగంగా తమ బ్యాటర్లు కొట్టే ప్రతీ సిక్సర్‌కు.. అలాగే తమ బౌలర్లు తీసే ప్రతీ వికెట్‌కు రూ.లక్ష (భారత కరెన్సీలో 30,683) చొప్పున పాలస్తీనా చారిటబుల్ సంస్థలకు విరాళంగా అందిస్తామని ముల్తాన్స్ యజమాని అలీ ఖాన్ తరాని ప్రకటించాడు. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Updated Date - Apr 14 , 2025 | 03:49 AM