ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Archery World Cup: మన ప్రదర్శన మధురం

ABN, Publish Date - May 11 , 2025 | 05:29 AM

వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2 పోటీల్లో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో అహో అనిపించారు. ఈ మెగా టోర్నీలో కాంపౌండ్‌ విభాగంలో ఏకంగా ఐదు పతకాలు కొల్లగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, ఓ రజతం, రెండు కాంస్యాలు...

  • మధురకు మూడు పతకాలు

  • సురేఖ, చికిత బృందానికి రజతం

  • ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2

షాంఘై: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2 పోటీల్లో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో అహో అనిపించారు. ఈ మెగా టోర్నీలో కాంపౌండ్‌ విభాగంలో ఏకంగా ఐదు పతకాలు కొల్లగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, ఓ రజతం, రెండు కాంస్యాలు సాధించారు. అయితే, ఏమాత్రం అంచనాలు మహారాష్ట్ర అమ్మాయి మధుర ధమన్‌గావోన్కర్‌ మూడు పతకాలతో హ్యాట్రిక్‌ కొట్టడం విశేషం. ఇక, తెలుగమ్మాయిలు వెన్నం జ్యోతి సురేఖ, యువ ఆర్చర్‌ చికిత తానిపర్తి రజత పతకాన్ని ఖాతాలో వేసుకున్నారు. పురుషుల టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో అభిషేక్‌ వర్మ, ఓజాస్‌, రిషభ్‌ యాదవ్‌లతో కూడిన భారత త్రయం 232-228తో మెక్సికో జట్టును ఓడించి పసిడి నెగ్గింది. ఇక, మహిళల వ్యక్తిగత ఈవెంట్‌ టైటిల్‌పోరులో 24 ఏళ్ల మధుర 139-138తో అమెరికా ఆర్చర్‌ కార్సన్‌ రహేపై గెలిచి వరల్డ్‌క్‌పలో తొలిసారి స్వర్ణాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత మహిళల టీమ్‌ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ, చికిత, మధురలతో కూడిన భారత జట్టు 221-234తో మెక్సికో బృందం చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ కాంస్యం పోరులో మధుర/అభిషేక్‌ వర్మ ద్వయం 144-142తో మలేసియా జంటను చిత్తుచేసి పతకాన్ని అందుకుంది. ఇక, వ్యక్తిగత ఈవెంట్‌ కాంస్యం పోరులో అభిషేక్‌ షూటా్‌ఫలో కొరియా ఆర్చర్‌ కిమ్‌ జాంగ్జోను ఓడించి టోర్నీలో రెండో పతకం సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - May 11 , 2025 | 06:39 AM