జ్యోతికి స్వర్ణం
ABN, Publish Date - May 30 , 2025 | 04:47 AM
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సమూడోరోజు తెలుగమ్మాయిలు రెండు స్వర్ణాలు సాధించారు. జ్యోతి యర్రాజి మీట్ రికార్డు టైమింగ్‌తో స్వర్ణం నెగ్గగా..రిలేలో కుంజా రజిత పసిడి అందుకుంది...
4 X 400 రిలేలో తెలుగమ్మాయి కుంజా రజితకు పసిడి
స్టీపుల్ చేజ్‌లో సబ్లే అదుర్స్
ఆసియా అథ్లెటిక్స్
గుమి (కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సమూడోరోజు తెలుగమ్మాయిలు రెండు స్వర్ణాలు సాధించారు. జ్యోతి యర్రాజి మీట్ రికార్డు టైమింగ్‌తో స్వర్ణం నెగ్గగా..రిలేలో కుంజా రజిత పసిడి అందుకుంది. ఇక స్టీపుల్ చేజ్‌లో 36 ఏళ్ల తర్వాత అవినాష్ సబ్లే బంగారు పతకాన్ని అందించాడు. క్రీడలకు మూడో రోజైన గురువారం మూడు స్వర్ణాలు సహా ఆరు పతకాలు సాధించిన భారత్ మొత్తం 14 మెడల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. మహిళల 100 మీ. హర్డిల్స్‌లో డిఫెండింగ్ చాంప్ జ్యోతి 12.96 సెకన్ల టైమింగ్‌తో టాప్‌లో నిలిచింది. ఈ క్రమంలో 2000లో సూ యిపింగ్ (చైనా) 12.99 సెకన్ల రికార్డును జ్యోతి అధిగమించింది. అంతేకాకుండా ఈ ఈవెంట్‌లో స్వర్ణాన్ని నిలబెట్టుకొన్న ఐదో అథ్లెట్‌గా కూడా యర్రాజీ రికార్డులకెక్కింది. తనాక (జపాన్) రజతం, ఉ యన్ని (చైనా) కాంస్యం దక్కించుకొన్నారు. మహిళల 4్ఠ400 రిలేలో తెలుగమ్మాయి కుంజా రజితతోపాటు జిస్నా మాథ్యూ, రూపల్ చౌధరి, శుభా వెంకటేశన్‌లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 34.18 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం నెగ్గగా.. వియత్నాం రజతం, శ్రీలంక కాంస్యం సాధించాయి.
పురుషుల 3000 మీ. స్టీపుల్ చేజ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సబ్లే 8 నిమిషాల 20.92 సెకన్ల టైమింగ్‌తో బంగారు పతకం సాధించాడు. పురుషుల 4్ఠ400మీ. రిలేలో జై కుమార్, ధరమ్‌వీర్ చౌధరి, మను, విశాల బృందం 3 నిమిషాల 3.67 సెకన్ల టైమింగ్‌తో రజతం దక్కించుకొంది. మహిళల లాంగ్ జంప్‌లో అన్సీ సోజన్ (6.33 మీ.) రజతం, షైలీ సింగ్ (6.30 మీ.) కాంస్యం సాధించారు.
ఇవి కూడా చదవండి..
IPL 2025 PBKS vs RCB: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు స్వల్ప టార్గెట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 30 , 2025 | 04:47 AM