ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 RCB vs CSK: గెలిస్తే మళ్లీ టాప్ ప్లేస్‌కు.. చెన్నైపై ఆర్సీబీ జోరు కొనసాగేనా

ABN, Publish Date - May 03 , 2025 | 04:45 PM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆర్సీబీ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా ఆర్సీబీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరడమే కాకుండా ప్లే ఆఫ్స్ కోసం బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంటుంది. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌లో ఆర్సీబీని చెన్నై టీమ్ కాకుండా వర్షం భయపెడుతోంది.

RCB vs CSK

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈ సీజన్‌లో (IPL 2025) అంచనాలకు మించి రాణిస్తోంది. వరుస విజయాలతో టాప్ త్రీలో కొనసాగుతోంది. ఈ రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడుతోంది (RCB vs CSK). ఈ మ్యాచ్‌లో కూడా ఆర్సీబీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరడమే కాకుండా ప్లే ఆఫ్స్ కోసం బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంటుంది. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌లో ఆర్సీబీని చెన్నై టీమ్ కాకుండా వర్షం (Rain) భయపెడుతోంది. ఈ రోజు మ్యాచ్ వర్షం వల్ల దాదాపుగా రద్దయ్యే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి.


వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునేందుకు ఆర్సీబీ మరికొంత సమయం వెయిట్ చేయకతప్పదు. గత రెండ్రోజులుగా బెంగళూరు నగరం వర్షంతో తడిసి ముద్దవుతోంది. ఈ రోజు కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు వర్షం కురిసే అవకాశాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ వర్షం అవకాశం ఇస్తే చెన్నైపై గెలవడం బెంగళూరుకు పెద్ద కష్టం కాదు. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో కనుక గెలిస్తే మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరుతుంది.


ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 35 సార్లు తలపడ్డాయి. వాటిల్లో 21 సార్లు చెన్నై గెలపొందింది. 13 సార్లు బెంగళూరు గెలిచింది. ఒక్క మ్యాచ్ రద్దయింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నైపై ఆర్సీబీ ఏకంగా 50 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా, చిన్నస్వామి స్టేడియంలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 11 సార్లు తలపడ్డాయి. రెండు జట్లు చెరో ఐదు సార్లు విజేతలుగా నిలిచాయి. ఒక్క మ్యాచ్ రద్దయింది. మరి, ఈ రోజు మ్యాచ్ జరిగాలని బెంగళూరు అభిమానులు వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2025 | 04:45 PM