IPL 2025 RCB vs CSK: కోహ్లీ vs ధోనీ.. ఇదే చివరి మ్యాచ్ అవుతుందా.. ఇరు జట్లల కీలక ఆటగాళ్లు వీరే
ABN, Publish Date - May 03 , 2025 | 04:58 PM
ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు ఎంత మంది ఉన్నా ధోనీ, కోహ్లీ పైనే అందరి కళ్లూ ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే ధోనీ, కోహ్లీ కలిసి ఆడే చివరి మ్యాచ్ ఇదే అవుతుంది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడుతోంది (RCB vs CSK). వర్షం ఈ మ్యాచ్‌కు అడ్డంకిగా మారుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ జరిగి ఆర్సీబీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరడమే కాకుండా ప్లే ఆఫ్స్ కోసం బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంటుంది.
ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు ఎంత మంది ఉన్నా ధోనీ, కోహ్లీ పైనే అందరి కళ్లూ ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే ధోనీ, కోహ్లీ కలిసి ఆడే చివరి మ్యాచ్ ఇదే అవుతుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్సీబీకి కోహ్లీ కచ్చితంగా కీలక ఆటగాడు. దేవ్‌దత పడిక్కళ్, రజత్ పటిదార్ మిడిలార్డర్‌లో కీలక పరుగులు చేస్తున్నారు. ఇక, గత మ్యాచ్‌లో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
బెంగళూరు బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా కనబడుతోంది. హేజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేస్తూ పరుగులు నియంత్రిస్తున్నారు. ఇక, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా కూడా స్పిన్‌తో ఆకట్టుకున్నారు. మరోవైపు చెన్నై ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించడం లేదు. గత మ్యాచ్‌లో సామ్ కరన్ ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. శివమ్ దూబే కూడా పరుగులు చేస్తున్నాడు. బౌలింగ్‌లో నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకున్న చెన్నై ఈ మ్యాచ్‌లో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 03 , 2025 | 04:58 PM