ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 RCB: ఎరుపెక్కనున్న చిన్నస్వామి స్టేడియం.. ఆర్సీబీ ఆటగాళ్లకు ఘన సన్మానం

ABN, Publish Date - Jun 04 , 2025 | 02:49 PM

దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ ట్రోపీని ముద్దాడడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొంది బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

RCB

దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ (RCB) ఐపీఎల్ ట్రోపీని ముద్దాడడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి (IPL 2025). అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొంది బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం ఘనంగా బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించాలనుకున్నారు. అయితే పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు (IPL Final).


విక్టరీ పరేడ్ రద్దు అయినప్పటికీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మాత్రం సంబరాలు ఘనంగా జరగబోతున్నాయి. ఆర్సీబీ జట్టులోని ఆటగాళ్లను యాజమాన్యం సన్మానించబోతోంది. సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. కేవలం ఎంట్రీ పాసులు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి ఆహ్వానిస్తారు. అలాగే స్టేడియం సమీపంలో పార్కింగ్ సౌకర్యం తక్కువగా ఉండడంతో పోలీసులు మరో సూచన చేశారు. స్టేడియంలోకి వెళ్లే వారు మెట్రో, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలని సూచించారు.


నిజానికి ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ను బెంగళూరులోని విధాన సభ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు నిర్వహించాలనుకున్నారు. ఓపెన్ బస్‌లో ఆటగాళ్లతో పరేడ్ నిర్వహించాలనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. అయితే పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు.


ఇవి కూడా చదవండి..

Virat Kohli: నిన్ను ముద్దాడడం కోసం 18 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా: విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

IPL Final 2025: నెరవేరిన 18 ఏళ్ల కల.. ఈ సారి కప్పు ఆర్సీబీదే.. పంజాబ్‌పై గెలుపు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 04 , 2025 | 02:49 PM