Share News

IPL Final 2025: నెరవేరిన 18 ఏళ్ల కల.. ఈ సారి కప్పు ఆర్సీబీదే.. పంజాబ్‌పై గెలుపు

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:26 PM

ఆర్సీబీ అభిమానుల 18 ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజేతగా అవతరించింది. కింగ్ కోహ్లీ కల నెరవేరింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందింది.

IPL Final 2025: నెరవేరిన 18 ఏళ్ల కల.. ఈ సారి కప్పు ఆర్సీబీదే.. పంజాబ్‌పై గెలుపు
RCB Gets IPL 2025 Title

ఆర్సీబీ (RCB) అభిమానుల 18 ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ (IPL 2025) విజేతగా అవతరించింది. కింగ్ కోహ్లీ (Virat Kohli) కల నెరవేరింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొందింది (RCB vs PBKS). దీంతో బెంగళూరు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఆర్సీబీ ట్రోఫీ దక్కించుకుంది.


టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (16) త్వరగానే అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ (43) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటర్లు ఎవరూ అర్ధశతకం సాధించకపోయినప్పటికీ అందరూ తమ వంతు పరుగులు చేశారు. రజత్ పటిదార్ (26), జితేష్ శర్మ (24), మయాంగ్ అగర్వాల్ (24), లివింగ్‌స్టన్ (25) పరుగులు చేశారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జేమిసన్ మూడేసి వికెట్లు తీశారు.


191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు మంచి ఆరంభం లభించింది. ప్రియాంశ్ ఆర్య (24), ప్రభ్‌సిమ్రన్ (25) తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన జాస్ ఇంగ్లిస్ (39) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరు ఆడుతున్నప్పుడు పంజాబ్ సునాయాసంగా గెలుస్తుందనిపించింది. అయితే వీరు అవుటై తర్వాత పరిస్థితి తారుమారైంది. శ్రేయస్ అయ్యర్ (1) విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, కృనాల్ పాండ్యా రెండేసి వికెట్లు తీశారు.


ఇవీ చదవండి:

గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!

బీసీసీఐ బాస్‌గా మాజీ జర్నలిస్ట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 11:28 PM