Shubman Gill: అంపైర్‌తో గిల్ వాగ్వాదం చూశారా.. భారీ జరిమానా విధిస్తారా
ABN, Publish Date - May 03 , 2025 | 06:04 PM
శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ అయిన గిల్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. తన రనౌట్ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా కనిపించే యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కాస్తా ఉద్వేగానికి గురయ్యాడు. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది (GT vs SRH). ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ అయిన గిల్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. తన రనౌట్ (Gill Runout) విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ రనౌట్ అయినట్టు థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఆ నిర్ణయంపై గిల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
గిల్ 76 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు హర్షల్ పటేల్ విసిరిన బంతిని కీపర్ క్లాసెన్ అందుకునే ప్రయత్నం చేశాడు. బంతి క్లాసెన్ గ్లౌస్‌కు తాకి స్టంప్స్ పక్క నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో గ్లౌస్ తాకడంతో బెయిల్స్ లేచాయి. బంతి చేతిలో ఉండగానే బెయిల్స్ లేచాయా అనే విషయంలో క్లారిటీ లేదు. పలుసార్లు రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఆశ్చర్యకరంగా అవుట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయం గిల్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఆ నిర్ణయంతో షాక్ అయిన గిల్ మైదానం నుంచి బయటకు వస్తూ థర్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. థర్డ్ అంపైర్ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా అతడి మాట వినకుండా కోపంగా ఏదో మాట్లాడాడు. అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన కారణంగా గిల్‌కు ఐపీఎల్ యాజమాన్యం భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. కాగా, అంపైర్‌తో గిల్ వాగ్వాదం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 03 , 2025 | 06:04 PM