IOA Approves Bid: కామన్వెల్త్ క్రీడల బిడ్ దాఖలుకు ఐవోఏ గ్రీన్ సిగ్నల్
ABN, Publish Date - Aug 14 , 2025 | 01:53 AM
కామన్వెల్త్ క్రీడల (2030) నిర్వహణ కోసం బిడ్‌లు దాఖలు చేయడానికి భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధికారికంగా ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఈ నిర్ణయం...
2030 కామన్వెల్త్ క్రీడల బిడ్డింగ్
ప్రతిపాదిత వేదిక: అహ్మదాబాద్ (గుజరాత్)
ఆఖరి తేదీ : ఆగస్టు 31
తుది నిర్ణయం: నవంబరు, గ్లాస్గోలో
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల (2030) నిర్వహణ కోసం బిడ్‌లు దాఖలు చేయడానికి భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధికారికంగా ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఈ నిర్ణయం తీసుకొంది. అహ్మదాబాద్ వేదికగా 2030 క్రీడల నిర్వహణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ లేఖను భారత్ ఈపాటికే అందజేసింది. అయితే, ఫైనల్ బిడ్‌ను ఈనెల 31లోపు దాఖలు చేయాల్సి ఉంది. నవంబరులో ఆతిథ్య హక్కులను ఖరారు చేయనున్నారు. భారత్‌కు పతకాల పంట పండించే అన్ని క్రీడా విభాగాలతో గేమ్స్‌ను సమగ్రంగా నిర్వహించాలనుకొంటున్నట్టు ఐవోఏ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ క్రీడల నిర్వహణ కోసం రేసులో ఉన్న కెనడా తప్పుకోవడంతో.. భారత్‌కే ఆతిథ్య హక్కులు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2010 క్రీడలకు ఆతిథ్యమిచ్చిన ఢిల్లీతోపాటు భువనేశ్వర్‌ను కూడా పోటీల నిర్వహణకు పరిశీలిస్తున్నట్టు ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపింది. 2026 గ్లాస్గో క్రీడలను నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. ఖర్చు నియంత్రణలో భాగంగా హాకీ, రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్ లాంటి అంశాలను తొలగించారు. అయితే, భారత్ ఆతిథ్యమిచ్చే క్రీడల్లో మాత్రం అన్నింటికీ చోటు కల్పించాలనుకొంటున్నారు. దేశవాళీ క్రీడలైన కబడ్డీ, ఖో-ఖోకు కూడా స్థానం కల్పించే అవకాశాలున్నాయని ఐవోఏ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ చౌబే చెప్పాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 14 , 2025 | 01:53 AM