ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

World Championship of Legends: పాక్‌తో ఆడేది లేదు

ABN, Publish Date - Jul 21 , 2025 | 03:29 AM

వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప ఆఫ్‌ లెజెండ్స్‌ (డబ్ల్యూసీఎల్‌)ను ఇండో-పాక్‌ ఉద్రిక్తతలు కుదిపేశాయి. టీమిండియా మాజీ స్టార్లు బాయ్‌కాట్‌ చేయడంతో.. భారత్‌, పాకిస్థాన్‌ వెటరన్‌ జట్ల మధ్య...

భారత వెటరన్‌ క్రికెటర్ల బాయ్‌కాట్‌

ఇండో-పాక్‌ లెజెండ్స్‌ మ్యాచ్‌ రద్దు

బర్మింగ్‌హామ్‌: వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప ఆఫ్‌ లెజెండ్స్‌ (డబ్ల్యూసీఎల్‌)ను ఇండో-పాక్‌ ఉద్రిక్తతలు కుదిపేశాయి. టీమిండియా మాజీ స్టార్లు బాయ్‌కాట్‌ చేయడంతో.. భారత్‌, పాకిస్థాన్‌ వెటరన్‌ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేయాల్సి వచ్చింది. గత ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా శిఖర్‌ ధవన్‌ సహా మరికొందరు భారత వెటరన్‌ క్రికెటర్లు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు నిరాకరించారు. డబ్ల్యూసీఎల్‌ను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ), బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. రెండో అంచె జూన్‌ 18న ఆరంభం కాగా.. వచ్చే నెల 2న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ భారత జట్టుకు సారథ్యం వహిస్తుండగా.. ధవన్‌, హర్భజన్‌, యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, రైనా, ఊతప్ప, ఆరోన్‌ జట్టు సభ్యులు. పాక్‌ జట్టు కెప్టెన్‌గా షాహిద్‌ అఫ్రీది వ్యవహరిస్తున్నాడు. ‘కొన్ని మధురానుభూతులు అందించాలనుకొన్నాం. అయితే, ఈ ప్రయత్నంలో కొందరి సెంటిమెంట్స్‌ను గాయపరిచినట్టు అర్థమైంది. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమాపణలు కోరుతున్నామ’ని డబ్ల్యూసీఎల్‌ నిర్వాహకులు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

కలిసి తిరుగుతారు కానీ...

భారత వెటరన్‌ క్రికెటర్ల నిర్ణయంపై పాక్‌ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘కలిసి తిరుగుతారు. హోటళ్లకు, షాపింగ్‌కు అంతా వెళతారు. తెరవెనుక సీన్‌ వేరే విధంగా ఉంటుంది. కానీ, ప్రజల ముందు మాత్రం మేం ఆడమంటూ రచ్చ చేస్తున్నార’ని పాక్‌ మాజీ పేసర్‌ అబ్దుర్‌ రౌఫ్‌ ఖాన్‌ విమర్శించాడు.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 21 , 2025 | 03:30 AM