ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

World Athletics Continental Tour: భారత్‌ ఆతిథ్యం

ABN, Publish Date - Aug 10 , 2025 | 06:03 AM

భారత్‌ తొలిసారి ఆతిథ్యమిస్తున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ బ్రాంజ్‌ లెవెల్‌ ఈవెంట్‌కు ఇక్కడి కళింగ స్టేడియం గ్రాండ్‌గా ముస్తాబైంది. ఆదివారం జరిగే ఈ పోటీల్లో ఆతిథ్య భారత్‌ సహా 15 దేశాల నుంచి 150 మందికిపైగా...

ఫేవరెట్లు శ్రీశంకర్‌, అన్ను

నేడు వరల్డ్‌ అథ్లెటిక్స్‌

కాంటినెంటల్‌ టూర్‌

భువనేశ్వర్‌: భారత్‌ తొలిసారి ఆతిథ్యమిస్తున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ బ్రాంజ్‌ లెవెల్‌ ఈవెంట్‌కు ఇక్కడి కళింగ స్టేడియం గ్రాండ్‌గా ముస్తాబైంది. ఆదివారం జరిగే ఈ పోటీల్లో ఆతిథ్య భారత్‌ సహా 15 దేశాల నుంచి 150 మందికిపైగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. త్వరలో జరిగే టోక్యో ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు అర్హతే లక్ష్యంగా అనేకమంది అథ్లెట్లు టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌, ఒలింపిక్‌ మాజీ విజేత నీరజ్‌ చోప్రాతో పాటు తెలుగమ్మాయి, స్ర్పింటర్‌ జ్యోతి యర్రాజీ, స్టీపుల్‌ చేజర్‌ అవినాశ్‌ సబ్లేలాంటి స్టార్లు గైర్హాజరవుతున్నా.. మిగతా టాప్‌ అథ్లెట్లు అన్నూ రాణి, మురళీ శ్రీశంకర్‌ భారత్‌ నుంచి ఫేవరెట్లుగా పోటీపడుతున్నారు. మహిళల జావెలిన్‌ త్రోయర్‌ అన్నూ రాణి ఈనెల ఆరంభంలో పోలెండ్‌ మీట్‌లో విజేతగా నిలిచి జోరు మీదున్నది. ఇక, శ్రీశంకర్‌ ఇటీవల వరుసగా మూడు అంతర్జాతీయ టైటిళ్లు నెగ్గి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. 200 మీటర్లలో జాతీయ రికార్డు గ్రహీత అనిమేశ్‌ కుజుర్‌, లాంగ్‌ జంప్‌లో షైలీ సింగ్‌, అన్సీ షోజన్‌, పురుషుల జావెలిన్‌ త్రోలో సచిన్‌ యాదవ్‌, 800 మీటర్లలో మహ్మద్‌ అఫ్జల్‌ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, లాంగ్‌ జంప్‌, ట్రిపుల్‌ జంప్‌, జావెలిన్‌ త్రో, 4.400 మీటర్ల రిలే మిక్స్‌డ్‌ ఈవెంట్లలో పోటీలుంటాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు

పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి

Updated Date - Aug 10 , 2025 | 06:03 AM