ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Womens Chess World Cup: తొలి గేమ్‌లో హంపి గెలుపు

ABN, Publish Date - Jul 20 , 2025 | 05:25 AM

తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు అర పాయింట్‌ దూరంలో నిలిచింది. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి యుక్సిన్‌ సాంగ్‌పై హంపి...

మహిళల చెస్‌ వరల్డ్‌కప్‌ క్వార్టర్స్‌

బటూమి జార్జియా): తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు అర పాయింట్‌ దూరంలో నిలిచింది. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి యుక్సిన్‌ సాంగ్‌పై హంపి విజయం సాధించింది. తెల్లపావులతో ఆడిన హంపి 53 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట కట్టించింది. ఆదివారం జరిగే రెండో గేమ్‌ను డ్రా చేసుకొన్నా చాలు.. హంపికి సెమీస్‌ బెర్త్‌ ఖరారవుతుంది. కాగా, భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్‌ మధ్య క్వార్టర్స్‌ మొదటి గేమ్‌ డ్రాగా ముగిసింది. ఇక, మరో క్వార్టర్స్‌ తొలి గేమ్‌లో మాజీ వరల్డ్‌ చాంపియన్‌ జోంగి టాన్‌ (చైనా)తో వైశాలి పాయింట్‌ పంచుకొంది. ఇక, క్వార్టర్స్‌లో హారిక, దివ్య తలపడుతుండడంతో భారత్‌ తరఫున ఒకరు సెమీస్‌ చేరడం ఖాయమైంది.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 05:25 AM