Wwomens ODI Cricket: హర్మన్ శతకం
ABN, Publish Date - Jul 23 , 2025 | 04:10 AM
హర్మన్‌ప్రీత్ కౌర్ (84 బంతుల్లో 14 ఫోర్లతో 102) సెంచరీతోపాటు మిగతా బ్యాటర్లు రాణించడంతో భారత మహిళల జట్టు భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్‌తో...
భారత్ 318/5
చెస్టర్‌లీ స్ట్రీట్: హర్మన్‌ప్రీత్ కౌర్ (84 బంతుల్లో 14 ఫోర్లతో 102) సెంచరీతోపాటు మిగతా బ్యాటర్లు రాణించడంతో భారత మహిళల జట్టు భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన సిరీస్ నిర్ణాయక ఆఖరి, మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎం చుకొన్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 318 పరుగుల భారీ స్కోరు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (50), స్మృతీ మంధాన (45), హర్లీన్ డియోల్ (45) చక్కని సహకారం అందించారు. ఎకెల్ స్టోన్, లారెన్ ఫైలర్ చెరో వికెట్ పడగొట్టారు. ఛేదనలో ఇంగ్లండ్ కడపటి వార్తలందే సమయానికి 35 ఓవర్లలో 195/4 స్కోరు చేసింది. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (98) త్రుటిలో సెంచరీ చేజార్చుకొంది. ఓపెనర్లు అమీ జోన్స్ (4), బ్యూమాంట్ (2)ను క్రాంతి పెవిలియన్ చేర్చగా.. అర్ధ శతకం సాధించిన ఎమ్మా ల్యాంబ్ (68)ను శ్రీచరణి బౌల్డ్ చేసింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 04:10 AM