ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Harbhajan Singh-Sreesanth: తప్పంతా నాదే.. శ్రీశాంత్‌తో వివాదంపై హర్భజన్ సింగ్ కామెంట్

ABN, Publish Date - Jul 21 , 2025 | 10:56 AM

తన కెరీర్ నుంచి పూర్తిగా తుడిచి పెట్టాలనుకునే ఒకే ఒక అధ్యాయం శ్రీశాంత్‌తో వివాదమని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఈ విషయంలో శ్రీశాంత్ కూతురి మాటలు తన గుండెను ఛిద్రం చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

Harbhajan Singh apology

ఇంటర్నెట్ డెస్క్: తన కేరీర్‌ నుంచి శాశ్వతంగా తుడిచి పెట్టేయాలనుకునే ఘటన శ్రీశాంత్‌తో వివాదమేనని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఈ వివాదంలో తప్పంతా తనదేనని విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2008 ఎడిషన్‌లో జరిగిన ఈ ఉదంతంపై హర్భజన్ తాజాగా ఆర్ అశ్విన్ ఛానల్ ‘కుట్టి స్టోరీస్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. నాటి ఐపీఎల్‌లో హర్భజన్ శ్రీశాంత్‌పై చేయి చేసుకోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

తన టాక్ షోలో అశ్విన్ మాట్లాడుతూ హర్భజన్ తన కెరీర్‌లోంచి తుడిచిపెట్టేయాల్సిన ఘటన ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. దీనికి హర్భజన్ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు.

‘నేను తుడిచి పెట్టేయాలనుకునే ఒకే ఒక ఘటన శ్రీశాంత్‌తో వివాదమే. అసలు ఆ సమయంలో జరిగింది పూర్తిగా తప్పే. నేను అలా చేసుండాల్సింది కాదు. ఈ విషయంలో ఇప్పటికే 200 సార్లకు పైగా క్షమాపణలు చెప్పి ఉంటా. ఇది జరిగి ఇన్నేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ బాధ కలుగుతుంది. సందర్భం దొరికిన ప్రతిసారీ ప్రతి వేదికపైనా నేను క్షమాపణలు చెబుతూనే ఉన్నా. మనందరం పొరపాట్లు చేస్తాము. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాము. అతడు నా జట్టు సభ్యుడు. ఇద్దరం కలిసి ఆడుతున్నాం. ఆ గేమ్‌లో మేము ప్రత్యర్థులమన్న మాట వాస్తవమే. కానీ వివాదం అంతలా ముదిరి ఉండాల్సింది కాదు’

‘ఈ విషయంలో తప్పు నాదే. అతడు చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది నన్ను రెచ్చగొట్టడమే. అతడు చేసిన దాంట్లో పెద్దగా తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కానీ నేను చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు’ అంటూ హర్భజన్ ఎమోషనల్ అయ్యాడు.

‘ఆ వివాదంపై శ్రీశాంత్ కూతురు అన్న మాటలు నన్ను ఇప్పటికీ బాధిస్తున్నాయి. ఓ సందర్భంలో ఆమెతో నేను ఆప్యాయంగా మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడటం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పింది. నువ్వు మా నాన్నపై చేయి చేసుకున్నావు అని అన్నది. ఆ మాటలు నా గుండెను ముక్కలు చేశాయి. కన్నీళ్లు ఉబికివచ్చినట్టైంది. ఆ చిన్నారిపై ఎంతటి ప్రభావం కలిగిందో అన్న బాధ కలిగింది. నా గురించి తను ఏమనుకుంటోందో అని తెగ కలత చెందాను. తన తండ్రిపై చేయి చేసుకున్న వ్యక్తిగా నేను మిగిలిపోయాను’

‘ఇది నా మనసుకు పెద్ద దెబ్బ. శ్రీశాంత్ కూతురికి ఇప్పటికీ క్షమాపణలు చెబుతాను. కానీ ఈ విషయంలో ప్రస్తుతం నేను ఇంతకు మించి చేయగలిగిందేమీ లేదు. నాపై నీ అభిప్రాయం మారేందుకు ఏం చేయాలని ఇప్పటికీ అడుగుతుంటా. నేను అలాంటి వాణ్ణి కాదని చెబుతుంటా. పెద్దయ్యాక ఆమెకు నాపై ఉన్న అభిప్రాయం మారుతుందని ఆశిస్తున్నా. చిన్నారికి ఎప్పటికీ మద్దతుగా ఉంటా’ అంటూ హర్భజన్ సింగ్ తన మనసులో ఆవేదనను వెలిబుచ్చాడు.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 21 , 2025 | 11:28 AM