ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dommaraju Gukesh: చెస్ రారాజు చిత్తు.. గుకేష్ ఎమోషనల్.. వీడియో చూసి తీరాల్సిందే!

ABN, Publish Date - Jun 03 , 2025 | 01:52 PM

వరల్డ్ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేష్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 14 ఏళ్లుగా ప్రపంచ నంబర్ వన్‌గా కొనసాగుతున్న కార్ల్‌సన్‌ను కంగుతినిపించాడు గుకేశ్. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Dommaraju Gukesh vs Magnus Carlsen

మాగ్నస్ కార్ల్‌సన్.. క్రీడా ప్రపంచం గురించి తెలిసిన దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితమే. చెస్ వరల్డ్‌లో రారాజుగా కొనసాగుతున్నాడు కార్ల్‌సన్. 14 ఏళ్లుగా ప్రపంచ నంబర్‌ వన్‌గా అతడు తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. క్లాసికల్-ర్యాపిడ్ ఫార్మాట్‌‌లో 5 సార్లు, బ్లిట్జ్ ఫార్మాట్‌లో ఏకంగా 8 సార్లు చాంపియన్‌గా నిలిచాడతను. అలాంటోడితో గేమ్ ఆడుతూ డ్రా చేసుకుంటే గొప్ప విషయమనే చెప్పాలి. అది గెలుపుతో సమానంగా చెబుతుంటారు. అలాంటిది ఏకంగా కార్ల్‌సన్‌ను మట్టికరిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్. నార్వే ఓపెన్ టోర్నీలో కార్ల్‌సన్‌ను చిత్తుచేశాడతను. చిరస్మరణీయ విజయం దక్కడంతో గుకేష్‌ ఎమోషనల్ అయిపోయాడు. నమ్మశక్యం కానట్లు కాసేపు కుర్చీలో కూర్చొని ఉండిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..


నమ్మలేని విజయం..

చాంపియన్ ప్లేయర్‌ మీద గెలుపును నమ్మలేకపోయాడు గుకేష్. మ్యాచ్ పూర్తవగానే కాసేపు కుర్చీలో కూర్చొని ఉండిపోయాడు. ఆ తర్వాత లేచి అటూ ఇటూ నడిచాడు. అతడి ముఖంలో విజయం సాధించాననే సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా కనిపించాయి. ఎమోషనల్ అయిన గుకేష్.. కాసేపు అందరికీ దూరంగా ఉన్నాడు. మరోవైపు ఊహించని ఓటమికి కార్ల్‌సన్‌ షాక్ అయ్యాడు. 19 ఏళ్ల గుకేష్ చేతిలో పరాజయం పాలవడంతో అతడు ఓటమి బాధను తట్టుకోలేకపోయాడు. బల్లను గట్టిగా కొడుతూ ఫ్రస్ట్రేషన్ చూపించాడు. దీంతో చెస్ బోర్డులోని కొన్ని పావులు కింద పడిపోయాయి. ఆ తర్వాత గుకేష్‌ను అభినందించిన కార్ల్‌సన్.. తిరిగొచ్చి గుకేష్‌కు క్షమాపణలు చెప్పాడు. అనంతరం పావులను తిరిగి బోర్డు మీద పెట్టేసి.. బయటకు నడక సాగించాడు. వెళ్తూ వెళ్తూ గుకేష్‌‌‌ను ఇంకోసారి అభినందించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కమాన్ చాంప్.. అదరగొట్టావ్ అంటూ గుకేష్‌ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

బీసీసీఐ బాస్‌గా మాజీ జర్నలిస్ట్

ఫైనల్‌లో ఫేవరెట్స్ ఎవరు?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 01:55 PM