WPL 2025: తెలుగు బిడ్డ సంచలనం.. ఒక్క డైవ్‌తో రిజల్ట్ చేంజ్
ABN, Publish Date - Feb 16 , 2025 | 09:38 AM
Mumbai Indians vs Delhi Capitals: విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఊపందుకుంది. ఢిల్లీ, ముంబై జట్ల మధ్య జరిగిన హైటెన్షన్ మ్యాచ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. అయితే రిజల్ట్ చేంజ్ అవడంలో క్రెడిట్ తెలుగు తేజం అరుంధతి రెడ్డికి ఇవ్వాల్సిందే.
మహిళల ప్రీమియర్ లీగ్ ఊపందుకుంది. శనివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఢిల్లీ-ముంబై మ్యాచ్ ఫ్యాన్స్‌ను మునివేళ్ల మీద నిల్చోబెట్టింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన ఈ ఫైట్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ. తొలుత ముంబై 19.1 ఓవర్లలో 164 రన్స్‌కు ఆలౌట్ అయింది. నాట్‌సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42) చెలరేగి ఆడారు. ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన ఢిల్లీని షెఫాలి వర్మ (18 బంతుల్లో 43), నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35) అద్భుత బ్యాటింగ్‌తో గెలుపు తీరాలకు చేర్చారు. అయితే గెలుపునకు క్రెడిట్ మాత్రం తెలుగమ్మాయికి ఇవ్వాల్సిందే.
వెంట్రుక వాసిలో..
ఢిల్లీ చేజింగ్‌లో చివరి 2 పరుగులతో కీలక పాత్ర పోషించింది తెలుగు తేజం అరుంధతి రెడ్డి. ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో బంతిని కవర్స్ దిశగా ఆడింది అరుంధతి. రాధతో కలసి పట్టుదలతో పరిగెత్తుతూ డబుల్ కంప్లీట్ చేసింది. రెండో రన్ తీసే క్రమంలో ఫీల్డర్ త్రో విసరడంతో రనౌట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. అయితే కసిగా పరిగెడుతూ వచ్చి నమ్మశక్యం కానిరీతిలో డైవ్ చేసింది అరుంధతి. వెంట్రుక వాసిలో రనౌట్ నుంచి తప్పించుకుంది. దీంతో ఢిల్లీ ఆటగాళ్లంతా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నికీ ప్రసాద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది.
ఇవీ చదవండి:
అభిషేక్ శర్మకు సన్‌రైజర్స్ బంపరాఫర్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 16 , 2025 | 10:13 AM