Rohit-Bumrah: బుమ్రా కోసం రోహిత్ త్యాగం.. అనుకున్నది సాధించిన బీసీసీఐ
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:59 PM
BCCI: భారత క్రికెట్ బోర్డు ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలదని అంటుంటారు. మరోమారు ఇది ప్రూవ్ అయిందని.. కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో బోర్డు అనుకున్నది సాధించిందని తెలుస్తోంది.

రోహిత్ శర్మ.. అటు బ్యాటర్‌గా, ఇటు సారథిగా దూసుకెళ్తున్నాడు. బ్యాట్‌తో మ్యాజికల్ నాక్స్ ఆడుతూనే.. కెప్టెన్‌గానూ జట్టును విజయపథాన నడిపిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా అతడు ఈ స్థాయిలో సక్సెస్ అవడంలో చాలా మంది ఆటగాళ్ల పాత్ర ఉంది. విరాట్ కోహ్లీ నుంచి మహ్మద్ షమి వరకు కీలక ప్లేయర్లంతా రాణించడం వల్లే ఇది సాధ్యం అవుతోంది. అయితే హిట్‌మ్యాన్ ట్రంప్‌కార్డ్ మాత్రం జస్‌ప్రీత్ బుమ్రానే. ప్రత్యర్థుల బెండు తీసేందుకు పేసుగుర్రాన్ని బాగా వాడుకుంటూ వస్తున్నాడు రోహిత్. అయితే ఇప్పుడు బుమ్రా వంతు వచ్చిందని తెలుస్తోంది. ఇన్నాళ్లూ జస్‌ప్రీత్ సేవల్ని వినియోగిస్తూ వచ్చిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు అతడి కోసం త్యాగానికి సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది. తనకు అండగా నిలబడిన సలార్ కోసం వరద సారథ్యాన్ని వదిలేయనున్నాడని వినిపిస్తోంది.
కొత్త కెప్టెన్!
బుమ్రాను టెస్టులకు రెగ్యులర్ కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ ఫిక్స్ అయిందట. త్వరలో జరిగే ఇంగ్లండ్ టూర్‌లో బుమ్రా నాయకత్వంలోనే లాంగ్ ఫార్మాట్ బరిలోకి దిగనుందట టీమిండియా. ఇప్పటివరకు సారథిగా కొనసాగుతూ వచ్చిన రోహిత్‌ను ఇక మీదట టెస్టులకు దూరంగా ఉంచుతారట. కేవలం వన్డేల్లోనే అతడ్ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయం రోహిత్‌కు కూడా చెప్పారని.. అందుకు అతడు ఓకే చెప్పాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి హిట్‌మ్యాన్ వన్డేలకే పరిమితం అవుతాడని సమాచారం. స్నేహితుడు బుమ్రా కోసం అతడు సారథ్యంతో పాటు తన స్థానాన్ని త్యాగం చేస్తున్నాడని తెలుస్తోంది.
టెస్టులకు గుడ్‌బై!
ఆసీస్ టూర్‌లో గాయపడిన బుమ్రా కోలుకున్నా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. బీసీసీఐ తలచుకుంటే అతడ్ని చాంపియన్స్ ట్రోఫీలో ఆడించేదట. కానీ ఇకపై బుమ్రా సేవల్ని ఎక్కువగా టెస్టులకే వినియోగించాలని భావిస్తోందట. అతడ్ని ఆ ఫార్మాట్‌కు పూర్తి స్థాయి సారథిగా నియమించాలని అనుకుంటోందట. అందుకే రిస్క్ వద్దనే ఉద్దేశంతో చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రాను దూరంగా ఉంచినట్లు పుకార్లు వస్తున్నాయి. అటు రోహిత్ వన్డేల్లో దుమ్మురేపుతున్నా టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నాడు. కెప్టెన్సీలో తేలిపోతూ విమర్శల పాలవుతున్నాడు. మరోవైపు వైస్ కెప్టెన్ బుమ్రా సూపర్బ్ ఆటతీరుతో ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. దీంతో అతడి చేతిలో టెస్ట్ టీమ్ ఫ్యూచర్ సేఫ్ అనే ఉద్దేశంతో బీసీసీఐ ప్రపోజల్‌కు హిట్‌మ్యాన్ ఓకే చెప్పాడని సమాచారం. ఇది తెలిసిన నెటిజన్స్.. రోహిత్ నిస్వార్థపరుడని.. అతడి నిర్ణయం భేష్ అని మెచ్చుకుంటుున్నారు.
ఇవీ చదవండి:
టీమిండియాకు అతడో టార్చ్‌బేరర్: అశ్విన్
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్
బీసీసీఐకి భారీగా బొక్క పెట్టిన స్టార్ బ్యాటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి