Yuzvendra Chahal: ఫైనల్ మ్యాచ్‌లో చాహల్ సందడి.. అతడితో ఉన్న బ్యూటీ ఎవరంటే..
ABN, Publish Date - Mar 09 , 2025 | 05:58 PM
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. అనుకున్నట్లే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫ్యాన్స్‌కు మస్తు మజాను పంచుతోంది. ఈ మ్యాచ్‌కు సాధారణ అభిమానులతో పాటు సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు కూడా భారీగా హాజరయ్యారు.
దుబాయ్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌లో సాధారణ అభిమానులతో పాటు పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. అందులో సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా అటెండ్ అయ్యాడు. కివీస్ ఇన్నింగ్స్ సమయంలో వికెట్లు పడిన ప్రతిసారి అతడు నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. భారత ఆటగాళ్లను అతడు ఎంకరేజ్ చేశాడు. అయితే అతడి పక్కన ఓ మిస్టరీ గర్ల్ కూడా సందడి చేసింది. దీంతో ఎవరామె.. అని అంతా ఆలోచించసాగారు. మరి.. ఆ బ్యూటీ ఎవరో ఇప్పుడు చూద్దాం..
పుకార్లకు ఊతం..
చాహల్ పక్కన కూర్చొని అతడితో సన్నిహితంగా కనిపించిన బ్యూటీ మరెవరో కాదు.. ప్రముఖ ఆర్జే మహ్వాష్ అని తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్‌తో ఆమె డేటింగ్ చేస్తోందని ఈ మధ్య బాగా పుకార్లు వచ్చాయి. వీళ్లిద్దరూ రెస్టారెంట్‌లో సందడి చేసిన పలు ఫొటోలు దీనికి మరింత ఊతమిచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ కలసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో హల్‌చల్ చేయడం, సన్నిహితంగా కనిపించడంతో ఆ వార్తలు నిజమేననే అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది. కాగా, చాహల్-ధనశ్రీ జంటకు విడాకులు కన్ఫర్మ్ అయ్యాయని.. బాంద్రా కోర్టు వీళ్లకు డివోర్స్ మంజూరు చేసిందని వినిపిస్తోంది. విడాకుల వార్తల వేళ మరో బ్యూటీతో చాహల్ సందడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి:
రెచ్చిపోతున్న స్పిన్నర్లు.. కివీస్‌ను కాచుకోగలమా..
కివీస్‌కు చుక్కలు చూపిస్తున్న కుల్దీప్
ప్లేయింగ్ 11తో ట్విస్ట్ ఇచ్చిన రోహిత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 09 , 2025 | 06:02 PM