Indias Playing 11: ఫైనల్ మ్యాచ్.. ప్లేయింగ్ 11తో ట్విస్ట్ ఇచ్చిన రోహిత్
ABN , Publish Date - Mar 09 , 2025 | 01:51 PM
IND vs NZ Toss: భారత్-కివీస్ మధ్య ఆఖరాట మొదలైపోయింది. టాస్ సమయంలో ఇరు టీమ్స్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాయి. మరి.. బరిలోకి దిగే ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్‌లో భలే ట్విస్ట్ ఇచ్చాడు భారత సారథి రోహిత్ శర్మ. ఊహించని విధంగా సేమ్ టీమ్ కాంబినేషన్‌ను ఎంచుకున్నాడు. టాస్ కోసం గ్రౌండ్‌లోకి వచ్చిన హిట్‌మ్యాన్.. కివీస్‌తో ఫైనల్‌లో ఏయే ప్లేయర్లను బరిలోకి దింపుతున్నాడో ప్రకటించాడు. సెమీఫైనల్ ఆడిన జట్టునే కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదని.. విన్నింగ్ టీమ్‌నే కంటిన్యూ చేస్తున్నానని వెల్లడించాడు.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమి.
ఇవీ చదవండి:
కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బ్యాటర్
నేడు ఫైనల్.. వీళ్ల ఆట మిస్సవ్వొద్దు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి