Share News

India Vs New Zealand Final: కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బ్యాటర్.. రోహిత్-కోహ్లీ కంటే డేంజర్

ABN , Publish Date - Mar 09 , 2025 | 01:21 PM

India Vs New Zealand Final: చాంపియన్స్ ట్రోఫీ కప్పు కోసం ఫైట్ మరికొద్ది సేపట్లో షురూ కానుంది. భారత్-న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకునే ఈ పోరులో ఓ ప్లేయర్ చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

India Vs New Zealand Final: కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బ్యాటర్.. రోహిత్-కోహ్లీ కంటే డేంజర్
IND vs NZ

కొదమ సింహాల్లాంటి భారత్-న్యూజిలాండ్ మరికొద్ది సేపట్లో కొట్లాడనున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025 కప్ కోసం ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి. ఇవాళ జరిగే తుదిపోరులో గెలిచిన టీమ్ ట్రోఫీతో సగర్వంగా స్వదేశానికి పయనం అవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ చాన్స్‌ను మిస్ చేసుకోవద్దని అటు కివీస్, ఇటు భారత్ పట్టుదలతో ఉన్నాయి. రెండు జట్లలోనూ బోలెడంత మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే ఓ ఆటగాడు మాత్రం శాంట్నర్ సేనకు వణుకు పుట్టిస్తున్నాడు. బ్లాక్‌క్యాప్స్ మీద అతడి రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. మరి.. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


వాటే యావరేజ్

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను చూసి న్యూజిలాండ్ భయపడుతోంది. ఆ టీమ్ మీద అయ్యర్ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. వన్డేల్లో కివీస్ మీద కన్‌సిస్టెంట్‌గా రన్స్ చేస్తున్నాడీ స్టైలిష్ బ్యాటర్. న్యూజిలాండ్‌తో మ్యాచ్ అంటే చాలు.. చెలరేగి ఆడుతున్నాడు. 103, 52, 62, 80, 49, 33, 105, 79.. గత కొన్ని ఇన్నింగ్స్‌ల్లో న్యూజిలాండ్ మీద అయ్యర్ బాదిన స్కోర్లు ఇవి. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓ మ్యాచ్‌లో తృ‌టిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఇంత మంచి యావరేజ్ ఉన్న అయ్యర్ ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలోనూ అదరగొడుతున్నాడు. ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్ గర్జిస్తే రిజల్ట్‌ భారత్ వైపు రావడం ఖాయమని న్యూజిలాండ్ వణుకుతోంది. రోహిత్-కోహ్లీ కాదు.. ముందు అతడ్ని ఆపితే చాలని అనుకుంటోంది. మరి.. ఏం జరుగుతుందో కొన్ని గంటల్లో తేలిపోతుంది.


ఇవీ చదవండి:

నేడు ఫైనల్.. వీళ్ల ఆట మిస్సవ్వొద్దు

అదరాలి ఫైనల్‌ పంచ్‌

విరాట్‌కు గాయం..?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 09 , 2025 | 02:20 PM