ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs NZ Prediction: కప్పు కోసం భారత్-కివీస్ కొట్లాట.. గెలుపెవరిది.. ప్రిడిక్షన్ ఇదే..

ABN, Publish Date - Mar 08 , 2025 | 04:33 PM

ICC Champions Trophy Final: చాంపియన్స్ ట్రోఫీలో ఆఖరాటకు రెడీ అవుతున్నాయి భారత్-కివీస్. గెలిచిన జట్టుకు ట్రోఫీ దక్కనుండటంతో ఫైనల్‌లో చెలరేగి ఆడాలని రెండు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రిడిక్షన్ ఎలా ఉంది.. ఎవరి వైపు మొగ్గు ఎక్కువగా ఉందో ఇప్పుడు చూద్దాం..

IND vs NZ Prediction

ఆఖరాటకు సిద్ధమవుతున్నాయి భారత్-న్యూజిలాండ్. దుబాయ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య రేపు సమరం జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ చాంపియన్స్ ట్రోఫీ-2025 విన్నర్‌గా నిలుస్తుంది. కప్పు కోసం జరిగే కొట్లాట కావడంతో ఇరు జట్లు మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలుపైనా, ఓటమైనా చివరి వరకు పోరాడటం తథ్యం కాబట్టి ఈ మ్యాచ్ యుద్ధాన్ని తలపించడం పక్కా. ఈ నేపథ్యంలో సండే ఫైట్‌లో గెలిచేదెవరు.. ప్రిడిక్షన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..


బలాలు

భారత్ బలాల విషయానికొస్తే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ వస్తాయి. గిల్, రోహిత్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, అక్షర్.. ఇలా బ్యాటర్లంతా ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా విరాట్-శ్రేయస్ భీకర ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమితో పాటు ఇతరులు కూడా మంచి టచ్‌లో ఉన్నారు.

న్యూజిలాండ్‌కు ఒక్కటి అని కాదు.. చాలా బలాలు ఉన్నాయి. మెరుపు ఫీల్డింగ్‌తో అసాధ్యమైన క్యాచులు అందుకోవడం, అద్భుతమైన రనౌట్లు చేయడం, 20 నుంచి 30 పరుగుల వరకు కాపాడటం కివీస్ ఆటగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. దీనికి తోడు మిచెల్ శాంట్నర్ నేతృత్వంలోని స్పిన్ యూనిట్ రాణిస్తుండటం.. అటు మ్యాట్ హెన్రీ హయాంలోని పేస్ యూనిట్ జోరు మీదుండటంతో భారత బ్యాటర్లకు పరేషాన్ తప్పేలా లేదు.


బలహీనతలు

ఈ టోర్నమెంట్‌లో భారత టాపార్డర్‌ నుంచి భారీ స్కోర్లు రాలేదు. గిల్-రోహిత్ అడపాదడపా రాణిస్తున్నా బిగ్ స్టార్ట్ ఇవ్వలేదు. కోహ్లీతో పాటు మిడిలార్డర్ రాణిస్తుండటంతో ఆ లోటు కనిపించట్లేదు. ఫీల్డింగ్‌లోనూ ఆటగాళ్లంతా మెరికల్లా కదులుతున్నా.. కొన్ని క్యాచులు నేలపాలు చేయడం, గ్రౌండ్‌ ఫీల్డింగ్‌లో కొంత తడబాటు కనిపిస్తోంది. అదే సమయంలో షమి తప్పితే ఆ స్థాయి పేసర్ టీమ్‌లో లేకపోవడం మైనస్సే. పాండ్యా ఉన్నా అంత ప్రభావం చూపించడం లేదు.

న్యూజిలాండ్‌కు బ్యాటింగ్‌లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో ఆ టీమ్ ఇబ్బంది పడుతోంది. గ్రూప్ స్టేజ్‌లో భారత స్పిన్నర్ల దెబ్బకు కివీస్ మిడిలార్డర్ కకావికలమైంది. గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ అంచనాలను అందుకోలేకపోయారు. రాన్రూను స్లోగా మారే దుబాయ్ పిచ్ మీద న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్లు ఎలా ఆడతారనే దాన్ని బట్టే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. వాళ్లు ఫెయిలైతే ఆ టీమ్ పనైపోయినట్లే.


రికార్డులు

ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 20 మ్యాచుల్లో తలపడగా.. అందులో ఆరింట భారత్, 12 మ్యాచుల్లో న్యూజిలాండ్ గెలిచాయి. 2 మ్యాచులు డ్రాగా ముగిశాయి. అయితే ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీ లీగ్ స్టేజ్‌లో కివీస్‌ను రోహిత్ సేన మడతబెట్టింది. ఓటమి అనేదే లేకుండా ఫైనల్స్‌కు దూసుకొచ్చింది. టీమ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. దుబాయ్ గ్రౌండ్‌కు మన ప్లేయర్లు బాగా అలవాటు పడ్డారు. అక్కడ వరుసగా 4 మ్యాచుల్లో నెగ్గారు.

గెలిచేదెవరు..

బలాబలాలు, రికార్డులు, ప్రస్తుత ఫామ్, కండీషన్స్.. ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే ఈసారి చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌దే విజయం ఖాయం. మన బలానికి తగ్గట్లు ఆడితే కివీస్‌ మీద జస్ట్ విన్ కాదు.. గ్రాండ్ విక్టరీ పక్కా.


ఇవీ చదవండి:

ముంబైకి షాక్.. 18 కోట్ల ప్లేయర్ దూరం

దుబాయ్ ఎరుపెక్కాల.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల

ఫైనల్ మ్యాచ్ టై అయితే.. ఏం చేస్తారు..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 08 , 2025 | 08:52 PM