Dubai Pitch Report: దుబాయ్ పిచ్ రిపోర్ట్.. భారత్-కివీస్‌లో ఎవరికి అనుకూలం..
ABN, Publish Date - Mar 08 , 2025 | 04:09 PM
ICC Champions Trophy Final: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆఖరుకు చేరుకుంది. రెండు వారాల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఈ టోర్నమెంట్‌లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.
చాంపియన్స్ ట్రోఫీ-2025 కప్పు కోసం భారత్-న్యూజిలాండ్ మధ్య భీకర పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా జరిగే సండే ఫైట్‌లో గెలిచిన జట్టు సగర్వంగా ట్రోఫీతో స్వదేశానికి పయనం అవుతుంది. వరుస విజయాలతో ఫైనల్స్‌కు చేరిన భారత్.. ఇదే జోరులో కివీస్‌ను మరోమారు చిత్తు చేసి చాంపియన్ అవ్వాలని అనుకుంటోంది. గ్రూప్ దశలో జరిగిన పరాభవానికి బదులు తీర్చుకోవడమే గాక కప్పునూ ఎగరేసుకుపోవాలని శాంట్నర్ సేన పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేస్తున్నారు.. అది ఎవరికి అనుకూలం.. భారత్‌కు ప్లస్సా.. మైనస్సా.. అనేది ఇప్పుడు చూద్దాం..
పిచ్ రిపోర్ట్
ఈ టోర్నమెంట్ మొత్తం దుబాయ్ పిచ్ స్పిన్నర్లకే అనకూలించింది. ఇన్నింగ్స్ మొదట్లో పవర్‌ప్లే సమయంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నా.. ఆ తర్వాత మాత్రం బౌలర్లదే హవా నడుస్తోంది. బంతి పాతగా మారాక హిట్టింగ్ చేయడం బ్యాటర్లకు కష్టమవుతోంది. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లకు వేగంగా పరుగులు చేయడం సాధ్యం కావడం లేదు. కండీషన్స్‌కు అలవాటు పడి సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేషన్ చేయడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు.
బౌలింగా.. చేజింగా..
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం రూపొందించిన స్టైల్‌లోనే ఫైనల్ మ్యాచ్‌కూ పిచ్‌ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ ఆపసోపాలు పడి 241 పరుగులు చేసింది. ఆ స్కోరును 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ అలవోకగా ఛేదించింది. ఒకవేళ అదే పిచ్‌ను రెడీ చేస్తే.. లోస్కోరింగ్ మ్యాచ్ లోడింగ్ అనే చెప్పాలి. పాక్‌తో పాటు ఆసీస్ మీదా సెమీస్‌లో చేజ్ చేసి గెలిచాం కాబట్టి టాస్ ఓడినా, గెలిచినా భారత్ భయపడే పరిస్థితుల్లేవు. అయితే ఒకవేళ టాస్ నెగ్గితే భారత్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. చేజింగ్‌లో తడబడటం కివీస్‌కు అలవాటు. కాబట్టి హిట్‌మ్యాన్ మొదట బౌలింగే ఎంచుకోవచ్చు.
ఇవీ చదవండి:
18 కోట్ల ప్లేయర్ ఐపీఎల్‌కు దూరం
ఫైనల్ మ్యాచ్ టై అయితే.. ఏం చేస్తారు..
ఫైనల్స్‌లో వర్షం పడితే విన్నర్ ఎవరు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 08 , 2025 | 09:56 PM