Share News

IND vs NZ: ఫైనల్స్‌లో వర్షం పడితే విన్నర్ ఎవరు.. భారత్‌కు ప్లస్సా.. మైనస్సా..

ABN , Publish Date - Mar 08 , 2025 | 09:39 AM

Champions Trophy Final 2025: టీమిండియా బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది. చాంపియన్స్ ట్రోఫీ వేటలో ఉన్న రోహిత్ సేన.. కప్పు కోసం ఆఖరాటకు సిద్ధమవుతోంది. ఇక్కడ గెలిస్తే ట్రోఫీతో స్వదేశానికి పయనం అవ్వొచ్చు.

IND vs NZ: ఫైనల్స్‌లో వర్షం పడితే విన్నర్ ఎవరు.. భారత్‌కు ప్లస్సా.. మైనస్సా..
Champions Trophy 2025

బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో ఫైనల్స్ మ్యాచ్‌ ఆడేందుకు రెడీ అవుతోంది. గ్రూప్ దశ నుంచి ఓటమి అనేదే లేకుండా తుదిపోరుకు దూసుకొచ్చిన రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ట్రోఫీతో ఇంటికి వెళ్లొచ్చు. ఆల్రెడీ గ్రూప్ స్టేజ్‌లో కివీస్‌ను మడతబెట్టినందున.. అదే పెర్ఫార్మెన్స్‌ను మళ్లీ రిపీట్ చేయాలని చూస్తోంది మెన్ ఇన్ బ్లూ. అచ్చొచ్చిన దుబాయ్‌లో అదరగొట్టాలని అనుకుంటోంది. అయితే వరుణుడు ఇప్పుడు రెండు జట్లను కలవరపెడుతున్నాడు. ఒకవేళ ఫైనల్స్‌లో వర్షం పడితే ఎవరు చాంపియన్‌గా నిలుస్తారో ఇప్పుడు చూద్దాం..


రిజర్వ్ డే ఉందా..

ఇప్పటికైతే ఫైనల్ మ్యాచ్‌కు వాన ముప్పు లేదని వెదర్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. పూర్తి 100 ఓవర్ల మ్యాచ్ సాధ్యమేనని చెబుతున్నారు. అయితే దుబాయ్‌లో ఈ మధ్య వాతావరణం అంచనాలకు అందని విధంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి.. ఏ టీమ్‌ను విజేతగా ప్రకటిస్తారు.. ఇది భారత్‌కు ప్లస్సా.. మైనస్సా అనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. ఒకవేళ ఆదివారం నాడు మ్యాచ్ సాధ్యం కాకపోతే సోమవారం (మార్చి 10) మ్యాచ్ నిర్వహిస్తారు.


షేర్ చేసుకోవాల్సిందే..

మ్యాచ్ జరిగే ఆదివారంతో పాటు రిజర్వ్ డే అయిన సోమవారం కూడా అదనంగా 2 గంటల సమయాన్ని కేటాయించింది ఐసీసీ. వాన కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే మరో రెండు గంటల పాటు ఎదురు చూస్తారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్-న్యూజిలాండ్‌ను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. రెండు జట్లు ట్రోఫీని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి.. వరుణుడు ఏం చేస్తాడో చూడాలి.


ఇవీ చదవండి:

దుబాయ్‌పై రచ్చ

రోహిత్ ముందు 5 సవాళ్లు

హర్లీన్‌ గెలిపించెన్‌!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 08 , 2025 | 09:55 AM