Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ.. 100 మంది పోలీసులపై వేటు.. ఇలాంటివి పాక్‌లోనే సాధ్యం
ABN, Publish Date - Feb 26 , 2025 | 01:34 PM
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టోర్నమెంట్ దాదాపుగా సగానికి వచ్చినా దాయాదికి ఇంకా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులు దక్కడంతో పాకిస్థాన్ ఎగిరి గంతేసింది. భారత్ సహా పలు దేశాలు తమ దగ్గర ఆడేందుకు తిరస్కరించడంతో పరువు పోగొట్టుకున్న వేళ.. ఐసీసీ టోర్నమెంట్ నిర్వహణ అవకాశం దక్కడంతో సంతోషంలో మునిగిపోయింది. కానీ అప్పటి నుంచి ఏదీ పాక్ క్రికెట్‌కు కలసి రావడం లేదు. ఒకవైపు టీమ్ పెర్ఫార్మెన్స్ పడిపోవడం, మరోవైపు పాక్‌కు వచ్చేది లేదని భారత్ కరాఖండీగా చెప్పడంతో పీసీబీకి ఏం చేయాలో పాలుపోలేదు. టోర్నమెంట్ మొదలైనా పాక్ బోర్డును సమస్యలు మాత్రం వదలడం లేదు. తాజాగా ఈ ట్రోఫీ కారణంగా ఏకంగా 100 మంది పోలీసులను సస్పెండ్ చేసే వరకు వెళ్లిందట. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
మాట వినకపోవడంతో..
చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భద్రతా విధులు నిర్వర్తించేందుకు పంజాబ్ ప్రావిన్స్‌లోని కొందరు పోలీసులు నిరాకరించారట. దీంతో వాళ్లపై అక్కడి సర్కారు వేటు వేసిందని తెలుస్తోంది. వేటు పడిన వాళ్లంతా పోలీసు దళంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్నారని వినిపిస్తోంది. సీటీ-2025 నేపథ్యంలో పలు సందర్భాల్లో వాళ్లకు డ్యూటీ కేటాయించగా.. హాజరుకాలేదని గుర్తించడంతో గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుందని సమాచారం. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం నుంచి టీమ్స్ బస చేసే హోటల్స్ వరకు ప్లేయర్లకు భద్రతగా ఉండేందుకు పోలీసులను కేటాయించామని.. వాళ్లలో కొందరు హాజరుకాకపోవడంతో వేటు వేశామని పంజాబ్ ప్రావిన్సు ఐజీపీ ఉస్మాన్ అన్వర్ తెలిపారు.
రీజన్ అదేనా..
పెద్ద సంఖ్యలో పోలీసులు విధులకు అటెండ్ కాకపోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని షాక్ అవుతున్నారు. అయితే భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఓడటం పోలీసులను తీవ్రంగా నిరాశపర్చిందని.. విధులకు వెళ్లకూడదనే డెసిషన్‌కు ఇదీ ఓ కారణమై ఉండొచ్చని వినిపిస్తోంది. సుదీర్ఘ పనిగంటలతో అలసట, ఒత్తిడికి గురవుతున్నారని.. అందుకే విధులకు వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నారని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఆల్రెడీ టోర్నమెంట్ నుంచి పాక్ టీమ్ బయటకు వచ్చేయడం, అటు భారత్‌పై ఓడటం, టీమిండియా మ్యాచులు తమ దగ్గర కాకుండా దుబాయ్‌లో జరగడం.. ఇలా చాలా విషయాలు అక్కడి పోలీసులను విధులు హాజరు కాకూడదనే నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమై ఉండొచ్చని నెటిజన్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
52 ఏళ్ల వయసులోనూ సచిన్ రప్పా రప్పా
నేను బతికేది దాని కోసమే: రోహిత్
నేను టీమిండియాను తప్పుపట్టలేదు: కమిన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 26 , 2025 | 01:39 PM