ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Anushka: లండన్‌కు విరాట్, అనుష్క.. మండిపడుతున్న నెటిజన్లు

ABN, Publish Date - Jun 05 , 2025 | 07:07 PM

ఆర్సీబీ విజయోత్సవ వేడుకల తొక్కిసలాటలో పలువురు మరణించిన ఘటన కలకలం రేపుతున్న తరుణంలో విరాట్ అనుష్క లండన్‌కు వెళ్లడంపై జనాలు మండిపడుతున్నారు.

Chinnaswamy Stadium stampede

ఐపీఎల్‌లో గెలిచిన నేపథ్యంలో ఆర్‌‌సీబీ ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐపీఎల్‌ను ఆద్యంతం ఆస్వాదించిన క్రికెట్ అభిమానులకు ఇదో భారీ షాక్. ఈ ఘటనపై టీం యాజమాన్యం కూడా విచారణ ఎదుర్కుంటోంది.

మరోవైపు, ఈ ఘటనపై విరాట్ కోహ్లీ అనుష్క శర్మ కూడా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ విషయంపై ఆర్సీబీ అధికారిక ప్రకటనను విరాట్ నెట్టింట పంచుకున్నాడు. ఆర్సీబీ టీమ్ మొత్తం ఆవేదనకు లోనైందని పేర్కొన్నాడు. ఈ దురదృష్టకర ఘటన తమకు తీవ్ర ఆవేదన మిగిల్చిందన్నారు. అయితే, గురువారం విరాట్, అనుష్క శర్మ లండన్ వెళ్లడం జనాలకు ఆగ్రహం తెప్పించింది. ఇక్కడ ఇంత జరుగుతుంటే తమకేమీ పట్టనట్టు విదేశాలకు ఎలా వెళతారంటూ కొందరు కామెంట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.


ఇక ఈ ఘటనపై అనేక మంది ప్రముఖులు నెట్టింట తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా కూడా ఈ విషయమై స్పందించారు. నెట్టింట తన ఆవేదన వెలిబుచ్చారు. ‘ఇటీవల జరిగిన తొక్కిసలాటల్లో డజన్ల కొద్దీ జనాలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ ఘటనలకు ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. మన దేశంలో సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా? వారి ప్రాణాల విలువ కప్పు చాయ్ కంటే తక్కువా? ఇలాంటివి ఎన్ని ఘటనలు జరిగినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఈ దుర్ఘటనకు నిర్వాహకులదే బాధ్యత అని అనేక మంది కుండబద్దలు కొట్టారు. సామాన్యుల భద్రతపై ఇంతటి నిర్లక్ష్యం తగదని మరికొందరు అన్నారు.


చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో ఈ దుర్ఘటన జరిగింది. అంచనాకు మించి అభిమానులు పోటెత్తడంతో వారిని నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. దీనికి తోడు వర్షం కూడా కురవడంతో తొక్కిసలాట జరిగి పలువురు దుర్మరణం చెందారు.

ఇవి కూడా చదవండి:

మైదానంలో తోపులాటకు దిగిన బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా క్రీడాకారులు.. షాకింగ్ దృశ్యాలు వైరల్

ఓటమి తట్టుకోలేని కార్ల్‌సన్‌ రియాక్షన్‌‌పై గుకేశ్ స్పందన ఇదీ

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 07:45 PM