ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian sports governance: బిన్నీకి 70 ఏళ్లు దాటినా పదవిలో కొనసాగేనా

ABN, Publish Date - Jul 20 , 2025 | 05:28 AM

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీకి శనివారంతో 70 ఏళ్లు నిండాయి. దీంతో బోర్డు రాజ్యాంగం ప్రకారం గరిష్ఠ వయోపరిమితి దాటడంతో బిన్నీ తన పదవికి అనర్హుడవుతాడు. ఈ నేపథ్యంలో.. సెప్టెంబరులో జరిగే వార్షిక సర్వసభ్య సాధారణ సమావేశం...

  • బీసీసీఐ చీఫ్‌ మార్పుపై ఉత్కంఠ!

  • పార్లమెంట్‌లో చర్చకు రానున్న కొత్త క్రీడాబిల్లు

  • బిల్లు ఆమోదం పొందితే మళ్లీ రోజర్‌కు చాన్స్‌?

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీకి శనివారంతో 70 ఏళ్లు నిండాయి. దీంతో బోర్డు రాజ్యాంగం ప్రకారం గరిష్ఠ వయోపరిమితి దాటడంతో బిన్నీ తన పదవికి అనర్హుడవుతాడు. ఈ నేపథ్యంలో.. సెప్టెంబరులో జరిగే వార్షిక సర్వసభ్య సాధారణ సమావేశం (ఏజీఎం) వరకు అతడు కొనసాగుతాడా? లేదా ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లాకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించి తప్పుకొంటాడా? అనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. అంతేకాకుండా జాతీయ క్రీడా బిల్లు ముసాయిదా రూపంలో మరో ట్విస్ట్‌ బిన్నీకి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో నూతన క్రీడా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ డ్రాఫ్ట్‌ ప్రకారం పాలకుల వయోపరిమితిని 70 నుంచి 75 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే.. జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎ్‌సఎఫ్‌)లకు అన్నింటికీ ఈ నిబంధన వర్తించనుంది. బీసీసీఐ కూడా ఎన్‌ఎ్‌సఎ్‌ఫ కావడంతో.. ఆ చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిబంధనల్లో కూడా ఎక్కడా వయో పరిమితులు విధించలేదు. ఇలా చూస్తే బోర్డు అధ్యక్షుడిగా బిన్నీ మరో ఐదేళ్లు కొనసాగవచ్చు. ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా, న్యాయనిపుణులతో బిన్నీ ఈపాటికే చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు, బోర్డులో చక్రం తిప్పగల పెద్దలు కూడా మరో మూడేళ్లు బిన్నీనే కొనసాగించాలని భావిస్తున్నారట. కొందరు మాత్రం కొత్త బిల్లు వచ్చే వరకు శుక్లాకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలంటున్నారట.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 05:32 AM