Bhavani Reddy: ఆసియా వెయిట్ లిఫ్టింగ్‌లో భవానికి పసిడి
ABN, Publish Date - Jul 08 , 2025 | 02:35 AM
ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ యువ లిఫ్టర్ రెడ్డి భవాని స్వర్ణ పతకం కొల్లగొట్టింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ యువ లిఫ్టర్ రెడ్డి భవాని స్వర్ణ పతకం కొల్లగొట్టింది. కజకిస్థాన్‌లోని ఆస్తానాలో జరుగుతున్న ఈ పోటీల్లో 48 కిలోల విభాగంలో భవాని మొత్తంగా 159 కిలోల బరువెత్తి విజేతగా నిలిచింది. క్లీన్ అండ్ జెర్క్‌లో 90 కిలోలు, స్నాచ్‌లో 69 కిలోల బరువెత్తి వీటిలో కూడా వ్యక్తిగత స్వర్ణాలు సాధించింది. విజయనగరం జిల్లాలోని కొండకరకం గ్రామం భవాని స్వస్థలం.
Updated Date - Jul 08 , 2025 | 02:36 AM