Home » Athletes
ఆసియా క్రీడల్లో బుధవారం భారత అథ్లెట్లు చెలరేగిపోతున్నారు. గంటల వ్యవధిలోనే నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. ఆర్చరీలో హ్యాట్రిక్ గోల్డ్ రావడం విశేషం.
ఆసియా క్రీడలు 2026లో భారత్ ఎనిమిదో రోజు పతకాల వేట కొనసాగిస్తోంది. లాంగ్ జంప్‌లో యాన్సీ సోజన్‌కు రజతం దక్కింది. మహిళల 200 మీటర్ల రన్నింగ్ రేసులో హరిత భద్ర మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో రెండు రజత పతకాలు వచ్చి చేరాయి. స్క్వాష్‌లో స్టార్ అథ్లెట్ అనాహత్ సింగ్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్ కూడా రజతం సాధించాడు.
ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెట్ ప్రాచీ చౌదరి సత్తా చాటింది. మహిళల 400 మీటర్ల ఫైనల్లో 53.21 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించింది.
భారత స్టార్ షాట్‌పుటర్ తజిందర్ పాల్ సింగ్ ఆసియా క్రీడల్లో మరో పతకం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫైనల్‌లో 20.64 మీటర్ల అత్యుత్తమ త్రో వేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఆసియా క్రీడల్లో మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ భరణికా ఇలంగోవన్ చరిత్ర సృష్టించింది. 4.15 మీటర్ల ఎత్తును అధిగమించి కాంస్య పతకం సాధించింది.
ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ రజత పతకం సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల 10,000 మీటర్ల ఫైనల్లో 28:29.38 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు.
ఆసియా క్రీడల్లో 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు రజత పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీమ్‌లో భాగమైన తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్‌లకు ఆ రాష్ట్ర సీఎం విజయ్ చెరో రూ.50లక్షల నజరానా ప్రకటించారు.
చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మింగ్ సంచలనం యూ జిడీ ఆసియా క్రీడల్లో అదరగొడుతోంది. జపాన్ వేదికగా జరుగుతున్న పోటీల్లో వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన 24 ఏళ్ల జై మీనా ఇప్పుడు భారత క్రీడా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు.