Share News

పారా ఆసియా గేమ్స్: భారత్‌కు పతకాల పంట.. ఒకే రోజు నాలుగు స్వర్ణాలు

ABN , Publish Date - Oct 19 , 2026 | 07:18 PM

ఆసియా పారా క్రీడలు-2026లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. జపాన్‌లోని నగోయాలో సోమవారం జరిగిన పోటీల్లో భారత్‌కు ఏకంగా 11 పతకాలు వచ్చాయి. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి.

పారా ఆసియా గేమ్స్: భారత్‌కు పతకాల పంట.. ఒకే రోజు నాలుగు స్వర్ణాలు
Asian Para Games 2026

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా పారా క్రీడలు-2026లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. జపాన్‌లోని నగోయాలో సోమవారం జరిగిన పోటీల్లో భారత్‌కు ఏకంగా 11 పతకాలు వచ్చాయి. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. షూటింగ్‌లో మోనా అగర్వాల్, లాంగ్‌జంప్‌లో నిషద్ కుమార్ పసిడి పతకాలతో మెరిశారు. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది.


  • మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగంలో మోనా అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్‌లో ఒక దశలో ఆరో స్థానంలో ఉన్న ఆమె.. ఆ తర్వాత పుంజుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా పారా క్రీడల రికార్డు స్థాయిలో 250 పాయింట్లు సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్, రెండుసార్లు పారాలింపిక్స్ పతక విజేత అవనీ లేఖరా 249.6 పాయింట్లతో రజతంతో సరిపెట్టుకుంది.

  • భారత స్టార్ పారా అథ్లెట్ నిషద్ కుమార్ పురుషుల లాంగ్‌జంప్ టీ47 విభాగంలో స్వర్ణం సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఈ విభాగంలో తొలిసారి పోటీపడుతున్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా 7.11 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచాడు.

  • అథ్లెటిక్స్‌లోనే సౌమ్య మహిళల 1500 మీటర్ల టీ12/టీ13 విభాగంలో 5 నిమిషాల 12.39 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణం గెలుచుకుంది. ఇదే పోటీలో భారత్‌కు చెందిన రాధా వెంకటేశ్ 5:30.90 సెకన్లతో రజతం సాధించి భారత జట్టుకు డబుల్ పోడియం విజయాన్ని అందించింది.

  • మహిళల టీ11 విభాగంలో రావణి వలసనైనికి కాంస్యం దక్కింది. తొలుత మూడో స్థానంలో నిలిచిన రక్షిత రాజు నిబంధనల ఉల్లంఘన కారణంగా అనర్హతకు గురవడంతో రావణి పతకాల స్థానానికి చేరుకుంది.

  • పురుషుల ఎఫ్46 జావెలిన్ త్రో పోటీ పూర్తిగా భారత అథ్లెట్ల ఆధిపత్యంలో సాగింది. రింకు స్వర్ణం సాధించగా.. అజీత్ సింగ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. చివరి ప్రయత్నంలో రింకు 65.11 మీటర్లు విసిరి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అజీత్ 65.02 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు.

  • భారత పారా జూడో క్రీడాకారులు కోకిల, కపిల్ పర్మార్ పతకాలు సాధించారు. మహిళల జే2-52 కేజీల విభాగంలో కోకిల ఫైనల్లో కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన ఐబికే ఉలాన్‌బెక్ కైజీ చేతిలో ఓడి రజతం గెలుచుకుంది. పురుషుల జే1-70 కేజీల విభాగంలో కపిల్ పర్మార్ కాంస్య పతకాన్ని సాధించాడు. సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జునేడీ చేతిలో 0-1 తేడాతో ఓడిన కపిల్.. కాంస్యం కోసం జరిగిన పోరులో అదే దేశానికి చెందిన అహ్నాఫ్ రఫ్లీ షిద్కీపై 1-0తో విజయం సాధించాడు.

  • పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఎస్13 విభాగంలో భారత స్విమ్మర్ రవి కార్తిక్ బుడిగినా రజత పతకం గెలుచుకున్నాడు. 56.68 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు.


ఇవి కూడా చదవండి:

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఓజా.. ప్యానెల్‌లో రమేశ్ పొవార్‌కు చోటు

ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ఎఫెక్ట్.. ఆ కామెంటేటర్లపై పాక్ బోర్డు వేటు!

Updated Date - Oct 19 , 2026 | 07:18 PM