Share News

ఆసియా క్రీడలు: ఆర్చరీలో మరో గోల్డ్.. తొలి భారత మహిళగా కుంకుమ్‌ చరిత్ర

ABN , Publish Date - Oct 03 , 2026 | 07:45 AM

భారత యువ ఆర్చర్ కుంకుమ్ మొహోద్ సంచలన విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

ఆసియా క్రీడలు: ఆర్చరీలో మరో గోల్డ్.. తొలి భారత మహిళగా కుంకుమ్‌ చరిత్ర
Kumkum Mohod

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ ఆర్చర్ కుంకుమ్ మొహోద్ సంచలన విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విభాగంలో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత మహిళగా కుంకుమ్ రికార్డు నెలకొల్పింది. టోర్నీ ఆరంభం నుంచే అద్భుత ప్రదర్శన కనబరిచిన కుంకుమ్.. కీలక మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో కొరియాకు చెందిన యుజెన్‌పై ఆధిపత్యం చెలాయించింది. కీలకమైన షూటౌట్‌లో ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా 10 పాయింట్ల షాట్‌తో విజయాన్ని ఖరారు చేసింది.


ఈ విజయంతో కుంకుమ్ మొహోద్‌కు మరో అరుదైన అవకాశం కూడా దక్కింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు భారత్‌కు వ్యక్తిగత కోటా స్థానాన్ని సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకంతో పాటు.. ఒలింపిక్స్‌కు కోటా స్థానం సాధించిన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో కుంకుమ్ ఆసియా క్రీడల్లో తన పతకాల సంఖ్యను మూడుకు పెంచుకుంది. ఇందులో రెండు స్వర్ణాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్ 2027.. గంభీర్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే: గంగూలీ

జైస్వాల్ ఆడకపోయినా పర్వాలేదు.. ఆ ఇద్దరినే కొనసాగించాలి: రహానె

Updated Date - Oct 03 , 2026 | 08:07 AM