పారా ఆసియా క్రీడల చాంపియన్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:57 AM
ప్రతిభకు వైకల్యం అడ్డుకాదంటూ అంతర్జాతీయ వేదికపై అద్భు త ప్రదర్శనతో మెరిసిన ఆ స్టార్ అథ్లె ట్.. నిజ జీవితంలో మాత్రం ఓడిపోయాడు. అనేక కష్టనష్టాలకోర్చి తానెంచుకున్న ఆటలో అత్యుత్తమస్థాయికి చేరిన అతడు..
విషం తాగి ప్రాణాలు తీసుకున్న స్టార్ అథ్లెట్
న్యూఢిల్లీ: ప్రతిభకు వైకల్యం అడ్డుకాదంటూ అంతర్జాతీయ వేదికపై అద్భు త ప్రదర్శనతో మెరిసిన ఆ స్టార్ అథ్లె ట్.. నిజ జీవితంలో మాత్రం ఓడిపోయాడు. అనేక కష్టనష్టాలకోర్చి తానెంచుకున్న ఆటలో అత్యుత్తమస్థాయికి చేరిన అతడు.. అర్ధంతరంగా తనువు చాలించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఆసియా పారా క్రీడల్లో మూడు స్వర్ణాలు నెగ్గిన పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. 42 ఏళ్ల నీరజ్ తన ఫ్లాట్‌లో విషం తాగి మరణించాడని ఢిల్లీ పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ విషయాన్ని భారత పారా అథ్లెటిక్స్ బృందం చీఫ్ కోచ్ సత్యనారాయణ ధ్రువీకరించారు. డోపింగ్ కారణంగా సస్పెన్షన్‌కు గురై ఇటీవలి పారా ఆసియా క్రీడలకు దూరమవడం, కొన్నాళ్లుగా తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళ దూరమవడం లాంటి కారణాలతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
అలా పోటీలకు దూరమై..: ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్.. ఏడేళ్ల వయసులోనే పోలియో బారినపడి వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. మొదట్లో వీల్‌ఛైర్ టెన్నిస్ ఆడిన అతడు అనంతరం పారా అథ్లెటిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. 2018 పారా ఆసియా క్రీడల జావెలిన్ త్రోలో స్వర్ణం నెగ్గిన నీరజ్.. 2023లో జావెలిన్, డిస్కస్ త్రో ఈవెంట్లలో విజేతగా నిలిచాడు. 2023 అక్టోబరులో బెంగళూరు సాయ్ సెంటర్‌లో నిర్వహించిన డోప్ టెస్టులో నీరజ్ నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్టు తేలింది. దీంతో అతనిపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ కారణంగానే అతడు ఇటీవల జపాన్ పారా ఆసియాడ్ పోటీలకు కూడా దూరమయ్యాడు.ఇదిలావుంటే..నీరజ్‌తో సన్నిహితంగా ఉంటున్న మహిళ మంగళ వారం అతన్ని కలిసి విడిపోదామని చెప్పినట్టు తెలిసిం ది. దీంతో అప్పటికే బాధలో ఉన్న నీరజ్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
డబ్ల్యూబీబీఎల్: బ్రిస్బేన్ హీట్ జట్టులో భారత క్రికెటర్‌కు చోటు!
రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు