Share News

వైష్ణవి మాయ

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:50 AM

యువ స్పిన్నర్‌ వైష్ణవి శర్మ (5/39) ఐదు వికెట్ల ఫీట్‌తోపాటు ప్రతీకా రావల్‌ (56 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్‌), షఫాలీ వర్మ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 నాటౌట్‌) అర్ధ శతకాలతో అదరగొట్టారు.

వైష్ణవి మాయ
Vaishnavi Sharma

  • ప్రతీక, షఫాలీ అర్ధ శతకాలు

  • మూడో వన్డేలో 8 వికెట్లతో జింజాబ్వే చిత్తు

  • సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసిన భారత్‌


2

మహిళల వన్డేల్లో వేగవంతమైన అర్ధ శతకం బాదిన రెండో భారత బ్యాటర్‌గా షఫాలీ వర్మ. 26 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకొన్న షఫాలీ.. గతంలో తన 29 బంతుల రికార్డును మెరుగుపర్చుకొంది. స్మృతి మంధాన (23 బంతులు) టాప్‌లో ఉంది.


వడోదర: యువ స్పిన్నర్‌ వైష్ణవి శర్మ (5/39) ఐదు వికెట్ల ఫీట్‌తోపాటు ప్రతీకా రావల్‌ (56 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్‌), షఫాలీ వర్మ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 నాటౌట్‌) అర్ధ శతకాలతో అదరగొట్టారు. దీంతో జింబాబ్వేతో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీ్‌ప్ చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వైష్ణవి తిప్పేయడంతో.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న జింబాబ్వే 39.5 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. మొడెస్టర్‌ ముపచిక్వా (37), కెప్టెన్‌ జోస్ఫిన్‌ ఎన్‌కోమో (35), చైజ్డా ధురూరు (20) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. క్రాంతి, సయాలీ చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. ఛేదనలో భారత్‌ 17 ఓవర్లలో 133/2 స్కోరు చేసి గెలిచింది. సిబండ, లోర్యాన్‌ ఫిరి చెరో వికెట్‌ పడగొట్టారు. ప్రతీక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్’గా నిలిచింది.


యాస్తిక విఫలం: స్వల్ప ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన యాస్తిక భాటియా (0) ఇన్నింగ్స్‌ తొలి బంతికే గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగింది. కానీ, ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్‌ ప్రతీక మరోసారి జింబాబ్వే బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్లీన్‌ డియోల్‌ (19)తో కలసి రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొంది. అయితే, 9వ ఓవర్‌లో హర్లీన్‌ను ఫిరి పెవిలియన్‌ చేర్చింది. ఈ దశలో ప్రతీకకు షఫాలీ జత కలవడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 50 బంతుల్లో 74 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో.. భారత్‌ మరో 198 బంతులు మిగిలుండగానే గెలిచింది. వర్మ ఎడాపెడా బౌండ్రీలు బాదగా.. ప్రతీక స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ సహకారం అందించింది. ఈ క్రమంలో 15వ ఓవర్‌లో ప్రతీక హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో రెండు ఓవర్ల అనంతరం షఫాలీ భారీ షాట్‌తో ఫిఫ్టీ మార్క్‌ను చేరుకోవడంతోపాటు మ్యాచ్‌ను ముగించింది.


స్కోరుబోర్డు

జింబాబ్వే: ముపచిక్వా (స్టంప్‌) భాటియా (బి) వైష్ణవి 37, ఫిరి (సి) భాటియా (బి) సయాలి 0, తిరిపనో (సి) షఫాలీ (బి) క్రాంతి 4, బిజా (సి) హర్మన్‌ (బి) వైష్ణవి 1, ఎన్‌కోమో (సి) జింటిమణి (బి) క్రాంతి 35, చైజ్డా ధురూరు (సి) జింటిమణి (బి) వైష్ణవి 20, మవుంగా (సి) హర్లీన్‌ (బి) వైష్ణవి 6, న్యాషా (బి) వైష్ణవి 10, ఒలిండర్‌ (బి) సయాలీ 0, సిబండ (రనౌట్‌/జింటిమణి) 3, చిపారె (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 39.5 ఓవర్లలో 131 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-6, 2-12, 3-25, 4-52, 5-95, 6-105, 7-119, 8-123, 9-125, 10-131; బౌలింగ్‌: క్రాంతి గౌడ్‌ 7-1-23-2, సయాలీ 6-1-11-2, జింటిమణి 6-0-27-0, వైష్ణవి 10-1-39-5, దీప్తి 6.5-1-12-0, షఫాలీ 4-1-17-0.

భారత్‌: భాటియా (సి) చిపారె (బి) సిబండ 0, ప్రతీక (నాటౌట్‌) 59, హర్లీన్‌ (సి) ముపచిక్వా (బి) ఫిరి 19, షఫాలీ (నాటౌట్‌) 51; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 17 ఓవర్లలో 133/2; వికెట్ల పతనం: 1-0, 2-59; బౌలింగ్‌: సిబండ 3-0-18-1, మవుంగా 2-0-18-0, చిపారె 4-0-25-0, ఫిరి 3-0-28-1, ఒలిండర్‌ 3-0-26-0, బిజా 2-0-17-0.


ఇవి కూడా చదవండి..

డబ్ల్యూబీబీఎల్‌: బ్రిస్బేన్ హీట్ జట్టులో భారత క్రికెటర్‌కు చోటు!

భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య

రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు

Updated Date - Oct 29 , 2026 | 12:52 AM