పారా ఆసియా గేమ్స్: అథ్లెటిక్స్‌లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజీకి స్వర్ణం
ABN , Publish Date - Oct 20 , 2026 | 07:28 AM
జపాన్ వేదికగా జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజీ సత్తా చాటింది. మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ వేదికగా జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజీ సత్తా చాటింది. మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్ రేసును 56.36 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. జపాన్‌కు చెందిన నీనా కన్నో 58.92 సెకన్లతో రజత పతకాన్ని గెలుచుకుంది. తన ప్రత్యర్థి కంటే రెండు సెకన్లకుపైగా ముందుగా లక్ష్యాన్ని చేరుకున్న దీప్తి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీంతో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 12కు చేరింది. కాగా ఇది ఐదో స్వర్ణం కావడం విశేషం.
హీట్స్‌లోనూ దీప్తి అదరగొట్టింది. 57.57 సెకన్లలో రేసును పూర్తి చేసి ఆసియా పారా గేమ్స్ రికార్డును నెలకొల్పింది. అయితే ఫైనల్లో అంతకంటే మెరుగైన ప్రదర్శన చేసి 56.36 సెకన్లలోనే గమ్యాన్ని చేరుకుంది. కీలకమైన పోరులో తన వేగాన్ని మరింత పెంచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పారిస్ పారాలింపిక్స్-2024లో కాంస్య పతకం సాధించిన దీప్తి.. మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది.
ఇవి కూడా చదవండి:
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఓజా.. ప్యానెల్‌లో రమేశ్ పొవార్‌కు చోటు
ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ఎఫెక్ట్.. ఆ కామెంటేటర్లపై పాక్ బోర్డు వేటు!