ఆర్చర్ శీతల్ ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:39 AM
భారత స్టార్ ఆర్చర్ శీతల్‌దేవి పారా ఆసియాడ్ పోటీలను రికార్డు ప్రదర్శనతో ఆరంభించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత క్వాలిఫికేషన్ రౌండ్‌లో శీతల్...
భారత స్టార్ ఆర్చర్ శీతల్‌దేవి పారా ఆసియాడ్ పోటీలను రికార్డు ప్రదర్శనతో ఆరంభించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత క్వాలిఫికేషన్ రౌండ్‌లో శీతల్ 720కిగాను 704 పాయింట్లు సాధించి 2024 పారాలింపిక్స్‌లో టర్కీ ఆర్చర్ ఓజ్నర్ గిర్డీ పేరిటనున్న ప్రపంచ రికార్డును సమం చేసింది. కాగా, శీతల్ చేసిన ఈ ప్రదర్శన పారా ఆసియా క్రీడల్లో మాత్రం సరికొత్త రికార్డు కావడం విశేషం. అనంతరం కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత జోడీ శీతల్/తోమన్ కుమార్ 1402 పాయింట్లు స్కోరు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో గతంలో శీతల్/రాకేశ్ జంట పేరిటనున్న 1400 పాయింట్ల ప్రపంచ రికార్డు కనుమరుగైంది. తాజా ప్రదర్శనతో శీతల్/తోమన్ ద్వయం నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Also Read:
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్‌ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే