Share News

రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:38 AM

గోదావరి డెల్టా సీఈ చినబాబుకు మెమో జారీ చేస్తూ ఏపీ ఇరిగేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
Godavari Delta CE

అమరావతి, అక్టోబర్ 19: గోదావరి డెల్టా చీఫ్ ఇంజినీర్ (సీఈ) చినబాబుకు మెమో జారీ చేస్తూ ఏపీ ఇరిగేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాగు నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు 2025లో మంజూరు చేసిన రూ.256.75 కోట్ల పనులకు సంబంధించిన బిల్లులను నేటికీ అప్‌లోడ్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఇరిగేషన్ శాఖ తీవ్రంగా స్పందించింది. నీటి సంఘాల ఓఅండ్ఎం పనులకు సంబంధించిన బిల్లులను రికార్డు చేసే పర్యవేక్షణలో అలసత్వం వహించినట్లు ఆ శాఖ గుర్తించింది.


ఈ నేపథ్యంలో బిల్లలు అప్‌లోడ్‌లో జాప్యానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా నిర్లక్ష్యం వహించినందుకు గోదావరి డెల్టా సీఈ చినబాబుకు ఈఎన్సీ మెమో జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

దసరా వచ్చిందయ్యా.. సంబరం తెచ్చిందయ్యా.

హైదరాబాద్‌లో విషాదం.. షేర్ మార్కెట్ నష్టాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 12:04 PM