Share News

దసరా వచ్చిందయ్యా.. సంబరం తెచ్చిందయ్యా.

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:42 AM

విజయవాడలో దసరా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఒక పక్క కూచిపూడి, భరతనాట్యం, జానపద ప్రదర్శనలతో విజయవాడ ఉత్సవ్‌-2 ప్రజలను ఉర్రూతలూగిస్తుండగా, మరోపక్క సరస్‌ మేళా అలరిస్తోంది.

దసరా వచ్చిందయ్యా..  సంబరం తెచ్చిందయ్యా.
SARASMELA

  • ఉర్రూతలూగుతున్న విజయవాడ

విజయవాడలో దసరా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఒక పక్క కూచిపూడి, భరతనాట్యం, జానపద ప్రదర్శనలతో విజయవాడ ఉత్సవ్‌-2 ప్రజలను ఉర్రూతలూగిస్తుండగా, మరోపక్క సరస్‌ మేళా అలరిస్తోంది. పున్నమిఘాట్‌లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమాల్లో దేశంలోని పలు రాష్ర్టాల కళాకారులు విభిన్నమైన నృత్యాలతో ఆకట్టుకున్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు పాల్గొన్నారు. తాను విజయవాడలోనే పుట్టానని, విశ్వనటుడు నందమూరి తారకరామారావు పుట్టిన నేలపై పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని రాఘవేంద్రరావు ఈసందర్భంగా అన్నారు. నిర్వాహకులను అభినందించారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కళాభిమానులను ఆకట్టుకున్నాయి. ‘చంద్రయాన్‌’ సినిమా బృందం సందడి చేసింది. హీరో శివకుమార్‌ ప్రసంగించారు.

సంబరంగా సరస్‌ మేళా

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఏర్పాటుచేసిన సరస్‌ మేళాకు ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. పలురకాల వస్త్రాలు, వస్తువులు, ఉత్పత్తులను తిలకిస్తూ..., ఫుడ్‌ స్టాల్స్‌లో వివిధ రాష్ట్రాల ఆహారాన్ని రుచి చూసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పలు స్టాళ్లు సందర్శించి మహిళా వ్యాపార వేత్తలతో మాట్లాడారు.

Updated Date - Oct 19 , 2026 | 08:05 AM