నంద్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:28 AM
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దేవస్థానం ఎదురుగా ఉన్న బీగాల ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న 6 దుకాణాలు దగ్ధమయ్యాయి.
నంద్యాల జిల్లా, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దేవస్థానం ఎదురుగా ఉన్న బీగాల ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న 6 దుకాణాలు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
బాధితుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. సిలిండర్‌లను పోలీసులు తొలగించడంతో త్రుటిలో భారీ ప్రాణనష్టం తప్పింది. మంటల్లో మూడు బొమ్మల దుకాణాలు, ఒక కూల్ డ్రింక్ షాప్, రెండు హోటళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా.. రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు
వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత
ఉత్సవ్ ద్వారా ఎంపీ శివనాథ్ విజయవాడకు ఓ బ్రాండ్ తెచ్చారు: పెమ్మసాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News