ఉత్సవ్ ద్వారా ఎంపీ శివనాథ్ విజయవాడకు ఓ బ్రాండ్ తెచ్చారు: పెమ్మసాని
ABN , Publish Date - Oct 18 , 2026 | 09:22 PM
విజయవాడ ఉత్సవ్ చాలా అద్భుతంగా జరుగుతోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఓ సంకల్పంతో అడుగు ముందుకు వేశారని కొనియాడారు.
విజయవాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఉత్సవ్ చాలా అద్భుతంగా జరుగుతోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) వ్యాఖ్యానించారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఓ సంకల్పంతో అడుగు ముందుకు వేశారని కొనియాడారు. నేడు ఆయన కృషితో లక్షలాది మంది ఆహ్లాదకరమైన వాతావరణంలో విజయవాడ ఉత్సవ్ 2.0ను ఆనందిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) విజయవాడ ఉత్సవ్ 2.0లో పెమ్మసాని పాల్గొని, మాట్లాడారు. జాతీయ సరస్ మేళాను కూడా పట్టుబట్టి ఎంపీ శివనాథ్ విజయవాడకు తీసుకువచ్చారని ప్రశంసించారు. అన్ని రాష్ట్రాల డ్వాక్రా మహిళలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారని తెలిపారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి..
మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో సరస్ మేళాను నిర్వహిస్తున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గత ఏడాది విజయవాడ ఉత్సవ్ ద్వారా శివనాథ్ ఇప్పటికే నగరానికి ఓ బ్రాండ్ తెచ్చారని ప్రస్తావించారు. ఈసారి అనేక రాష్ట్రాల సీఎంలను ఉత్సవ్‌కు పిలిచి సరికొత్తగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కళాకారులు, సినిమా నటులు.. ప్రజల మధ్యకు వచ్చి ఆడుతూ, పాడుతూ సందడి చేస్తున్నారని చెప్పారు. ఒకవైపు దుర్గమ్మ భక్తి, నారీశక్తి, ప్రగతి కలిసి విజయవాడ ఉత్సవ్ రూపంలో పాజిటివ్ దృక్పథం కలిగిస్తున్నాయని వివరించారు.
కళాకారులను ప్రోత్సహిస్తే మన సంస్కృతి బతుకుతుంది..
నగరాలు రోడ్లకు రూపాన్ని ఇస్తాయని, కళలు ఆయా ప్రాంతాలకు ఆత్మను ఇస్తాయని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. కళాకారులను ప్రోత్సహిస్తే మన సంస్కృతి బతుకుతుందని ఉద్ఘాటించారు. సంస్కృతిని గౌరవిస్తే మన ప్రాంతంలో తెలియని అనుభూతి కలుగుతుందని, అదే మన సంస్కృతి, వారసత్వ సంపద అని వెల్లడించారు. ఇలాంటి సమ్మేళనాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. తనను ఉత్సవ్‌కు ఆహ్వానించిన శివనాథ్‌కి, ఇక్కడకు వచ్చిన ప్రజలకు పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఉత్సవ్ కార్యక్రమాలు: ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్
విజయవాడలో తాను 2004లో సీపీగా పని చేశానని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. మళ్లీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. నిజంగా దసరా ఉత్సవాలంటే ఇలా ఉండాలని చెప్పుకొచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఉత్సవ్‌లో జరిగే కార్యక్రమాలను తిలకించాలని అన్నారు.
ఎంపీ శివనాథ్ నమ్మకం, కృషి చూసి ఆశ్చర్యం కలిగింది..
బిజీ షెడ్యూల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఉత్సవ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెన్నేటి కృష్ణప్రసాద్ వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పిన సమయంలో కొంత సందేహం కలిగిందని వెల్లడించారు. ఇక్కడకు వచ్చి చూశాక శివనాథ్ నమ్మకం, కృషి చూసి ఆశ్చర్యం కలిగిందని అన్నారు. కేంద్రమంత్రి పెమ్మసానిని హీరో చేస్తామని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చెప్పారని.. తాము కూడా ఆ సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నామని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి
రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్ఈసీ
రాయచోటిలో కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూసే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News