Share News

కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూస్తే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం

ABN , Publish Date - Oct 17 , 2026 | 02:04 PM

రాయచోటిలో అక్రమ ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకుని 10 మందిని పోలీసులు అరెస్టు చేసిన ఘటనపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేందుకే ఇతర ప్రాంతాల నుంచి ముఠాలను దింపారని ఆయన ఆరోపించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఈ ముఠాతో సంబంధాలున్నాయనే అంశంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూస్తే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం
AP Minister Mandipalli Ramprasad Reddy

రాయచోటి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాయచోటిలో అక్రమ ఆయుధాల కలకలం, రివాల్వర్లు, పిస్టళ్లు, బుల్లెట్లు, 10 మందిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (AP Minister Mandipalli Ramprasad Reddy) స్పందించారు. స్థానిక ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేందుకే ఢిల్లీ, హైదరాబాద్, పంజాబ్ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఠాలను దింపారని ఆరోపించారు. ఎవరిని చంపడానికి రాయచోటిలో మారణాయుధాలతో తిరుగుతున్నారనేది ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డికి ఈ ముఠాలతో ఏమైనా సంబంధాలున్నాయనే విషయంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని పట్టుబట్టారు.


ఏపీలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల ప్రశాంతతను దెబ్బతీసేలా కొన్ని ముఠాలను ఎందుకు దింపారని మంత్రి మండిపల్లి ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల వేల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్రమ ఆయుధాలు, కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు చేయాలని చూస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరో తేల్చి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 17 , 2026 | 02:33 PM