Share News

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:06 AM

స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటును పూర్తి చేశారు.

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
CM Chandrababu Naidu

అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) అభ్యర్థుల ఎంపికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటును పూర్తి చేశారు. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బిజీగా ఉన్నారు. క్షేత్రస్థాయి సమాచారం, ప్రజాభిప్రాయం ఆధారంగా అభ్యర్థులను వడపోశారు. ప్రజలకు సేవ చేసే నిబద్ధత, సమర్థత, ప్రజామోదం ఉన్నవారికే టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈసారి ప్రత్యక్ష పద్ధతిలోనే మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. స్థానికంగానూ ఉత్తమ నాయకత్వాన్ని అందించి.. 'ట్రిపుల్ ఇంజిన్' సర్కారుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.


కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలి: కూటమి ముఖ్యనేతల దిశానిర్దేశం

ఏపీవ్యాప్తంగా ఉన్న కూటమి పార్టీల నాయకులతో ఎన్డీఏ ముఖ్యనేతలు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ సమావేశం నిర్వహించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. మూడు పార్టీల కూటమి ఒకటే జట్టు అనే నినాదంతో స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని మార్గనిర్దేశం చేశారు. కూటమి ఐక్యతే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కూటమి నేతలు తెలిపారు.


ఏ చిన్నపాటి విభేదం లేకుండా పనిచేయాలి..

కూటమిలో విభేదాలు వస్తాయని ఎదురు చూసిన వారికి భంగపాటు కలిగేలా ఆయా సీట్ల కసరత్తు జరిగిందని కూటమి ముఖ్య నేతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక నుంచి... గెలుపు వరకు ఐక్యంగా పని చేయాలని సూచించారు. ఏ చిన్నపాటి విభేదం లేకుండా... సమస్యలను పరిష్కరించుకుంటూ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు. కూటమి పార్టీలు ఐక్యంగా ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. అందిస్తున్న సుపరిపాలనతో ఈ విషయాన్ని నిరూపించగలిగామని అన్నారు. అదే స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేటు సాధించి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయాలని కూటమి ముఖ్య నేతలు సూచించారు.


కూటమి శ్రేణులు ఐక్యంగా ఉండాలి..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కూటమి ముఖ్య నేతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయడమే కాకుండా... నామినేటెడ్ పదవుల్లో, స్థానిక ఎన్నికల్లోనూ కూటమిగా వెళ్లడం రాజకీయాల్లో చాలా అరుదైన సంఘటన అని చెప్పారు. రాష్ట్రం, ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర వహించిన మూడు పార్టీల్లోని శ్రేణులు మేలు కోసం ఐక్యంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోని విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చామని అన్నారు. మళ్లీ వైసీపీ ఛాయలు రాష్ట్రం మీద పడకూడదని.. దీన్ని మూడు పార్టీల్లోని కూటమి శ్రేణులు అర్థం చేసుకోని ప్రజలకు ఈ విషయాన్ని వివరించాలని ఎన్డీఏ ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 01:49 PM