Share News

ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు

ABN , Publish Date - Oct 14 , 2026 | 10:25 AM

విశాఖపట్టణంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నవంబరులో జరగనుంది. ఈ సదస్సు సన్నాహకంగా ఏపీ వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు
AP Investment Summits

  • ఏపీలో భారీగా పెట్టుబడులు

  • 115 ఎంవోయూలు, రూ.79,628 కోట్ల ప్రతిపాదనలు

  • త్వరలో 3 ప్రాంతీయ సదస్సులు

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): విశాఖపట్టణంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నవంబరులో జరగనుంది. ఈ సదస్సు సన్నాహకంగా ఏపీ వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే అక్టోబరు 7వ తేదీన విశాఖపట్నంలో, 12న కాకినాడలో రెండు సదస్సులు విజయవంతంగా పూర్తయ్యాయి.


మిగిలిన 3 ప్రాంతీయ సదస్సులను అక్టోబరు 16వ తేదీన అమరావతిలో, అక్టోబరు 23వ తేదీన అనంతపురంలో, అక్టోబరు 26వ తేదీన తిరుపతిలో ఏపీ సర్కార్ నిర్వహించనుంది. ఈ మూడు సదస్సుల్లో మొత్తం 115 ఎంవోయూలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సదస్సుల ద్వారా రాష్ట్రానికి రూ.79,628.04 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులు రానున్నాయి. దీని ద్వారా సుమారు 1,8,038 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ అధికారులు వెల్లడించారు.


ప్రధాన రంగాలివే..

పరిపాలన, రాజధాని అభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాలు, క్వాంటం వ్యాలీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఏరోస్పేస్-డిఫెన్స్, ఆటోమోటివ్, సహజ వ్యవసాయం, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం, టూరిజం, ఆతిథ్యరంగం, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, సెమీకండక్టర్లు, ఆధునిక మెటీరియల్స్, స్పేస్, పాదరక్షల రంగంలో పెట్టుబడులు రాబోతున్నాయి. ఇప్పటికే ముగిసిన రెండు ప్రాంతీయ సదస్సుల్లో 46 అవగాహన ఒప్పందాలు నమోదు కాగా, వాటి వివరాలు, తదుపరి సదస్సుల్లో ఒప్పందాలు చేసుకోబోయే కంపెనీల తాత్కాలిక జాబితా, పెట్టుబడుల వివరాలను ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కూటమిలో ఎన్నికల హడావుడి.. సీట్ల సర్దుబాటుపై చర్చలు

అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం

ఆత్మకూరు బైపాస్ రోడ్డుకు వాయుపుత్ర మార్గ్‌గా నామకరణం చేశాం: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 10:44 AM