ఏపీ కూటమిలో ఎన్నికల హడావుడి.. సీట్ల సర్దుబాటుపై చర్చలు
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:58 AM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, రిజర్వేషన్ల ఆధారంగా పోటీ చేసే స్థానాలపై చర్చిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోనూ టీడీపీ నేతలు ఇవాళ భేటీ కానున్నారు.
అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Local Body Elections) సీట్ల సర్దుబాటుపై కూటమి ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో (AP CM Chandrababu Naidu) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ రోజు (మంగళవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబుతో మాధవ్ చర్చిస్తున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటుపై తమ అభిప్రాయాలను చెప్పనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు చేరుకున్నారు. రిజర్వేషన్ల జాబితా ఇచ్చి దాని ప్రకారం పోటీ చేసే స్థానాలపై ఓ నిర్ణయానికి రావాలని సూచించారు.
ఈ రోజు తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాల జాబితాను సీఎం చంద్రబాబుకు మాధవ్ ఇవ్వనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో టీడీపీ నేతలు భేటీ కానున్నారు. జనసేన కేంద్ర కార్యాలయానికి పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు వెళ్లనున్నారు. రిజర్వేషన్లు జాబితా ఆధారంగా తాము పోటీ చేసే స్థానాల జాబితాను జనసేన నేతలు ఇవ్వనున్నారు. రేపు (బుధవారం) స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుండటంతో నేడు లేదా రేపు సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు కూటమి పక్షాలు రానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణమే మా లక్ష్యం:మంత్రి ఆనం
ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News