Share News

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Oct 14 , 2026 | 11:43 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన నష్టాన్ని ప్రజలు మర్చిపోలేదని అన్నారు.

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర
AP Minister Kollu Ravindra

అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన నష్టాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. ఈరోజు (బుధవారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి రవీంద్ర మాట్లాడారు. గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రం ఎంత అస్తవ్యస్తమైందో ప్రజలకు బాగా తెలుసునని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ ఉందని విమర్శించారు.


రానున్న ఎన్నికల్లో వన్‌సైడ్‌ విజయం సాధిస్తాం..

94 శాతం స్ట్రైక్‌ రేట్‌తో అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తావించారు. రెండేళ్లలో అన్నివర్గాలకు న్యాయం చేస్తూ తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని వెల్లడించారు. కూటమి పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉందని తెలిపారు. తమ ప్రభుత్వంపై పార్టీ శ్రేణులు జోష్‌‌తో ఉన్నారని చెప్పారు. ప్రజలకు కూటమి ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వన్‌సైడ్‌ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ హయాంలో జరిగిన నష్టాన్ని ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారని చెప్పారు. ప్రజల విశ్వాసమే కూటమి ప్రభుత్వానికి బలమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కూటమిలో ఎన్నికల హడావుడి.. సీట్ల సర్దుబాటుపై చర్చలు

అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం

ఆత్మకూరు బైపాస్ రోడ్డుకు వాయుపుత్ర మార్గ్‌గా నామకరణం చేశాం: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 12:53 PM