మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:18 AM
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు, ఒంగోలు, మచిలీపట్నం, మంగళగిరి సహా నాలుగు కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులతో పాటు 49 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నామినేషన్లకు రేపే చివరి తేదీ కావడంతో అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కసరత్తు చేస్తున్నారు. ఇవాళ (శనివారం) దశల వారీగా మిగిలిన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. 4 కార్పొరేషన్లకు మేయర్లు, 49 మున్సిపాల్టీలకు చైర్ పర్సన్లను తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది. గుంటూరు, ఒంగోలు, మచిలీపట్నం, మంగళగిరి మేయర్ అభ్యర్థులను కూడా ప్రకటించాల్సి ఉంది.
ఆయా అభ్యర్థుల ఎంపికపై ఐవీఆర్ఎస్ సర్వేలు కొనసాగుతున్నాయి. ఆయా వార్డుల వారీగాను అభ్యర్థులను జిల్లా నాయకత్వం ప్రకటించాల్సి ఉంది. వార్డుల అభ్యర్థులపై జిల్లాల్లో కూటమి నేతలు ఇప్పటికే ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నామినేషన్లకు రేపే (ఆదివారం) చివరి తేదీ కావడంతో ఈరోజులోగా పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితాను కొలిక్కి తెచ్చే పనిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బిజీగా ఉన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ వ్యూహం మొదలుపెట్టిన టీడీపీ నేతలు
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ వేళ తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయ వ్యూహం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కొవ్వూరులో టీడీపీలో వైసీపీ నేతలు చేరుతున్నారు. టీడీపీ కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా కంటమణి విజయలక్ష్మి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మున్నిపల్ ఎన్నికల్లో పోటీకి వెనక్కు తగ్గుతున్నా వైసీపీ నేతలు
మరోవైపు.. మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేయడానికి వైసీపీ నేతలు వెనక్కు తగ్గుతున్నారు. తొలుత ప్రకటించిన వైసీపీ కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి మన్నే పద్మ పోటీకి దూరంగా ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పద్మను అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె పోటీ చేయడానికి ఇష్టపడకపోవడంతో మరో అభ్యర్థిని నిలబెట్టడానికి రంగంలోకి వైసీపీ ముఖ్య నేతలు దిగారు. వార్డు మెంబర్లు కూడా ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయోమయ స్థితిలో వైసీపీ కొవ్వూరు నాయకులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News